Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్ లో భారీ గోల్మాల్

హైదరాబాద్ లో భారీ గోల్మాల్

వార్త 2 months ago

టిఎంలలో ఉంచే రూ.1.20 కోట్ల నగదుతో ఇద్దరు ఉద్యోగుల పరార్

Hyderabad ATM Theft: హైదరాబాద్ లో మరో గోల్మాల్ వెలుగు చూసింది. ఎటిఎంలలో నగదు భద్రపరిచే కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న సిఎంఎస్ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు ఏకంగా కోటీ 20 లక్షల 98 వేల 500 రూపాయల నగదుతో ఉడాయించారు.

ఇది జరిగి వారం రోజులు దాటి వుండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిఎంఎస్ సంస్థ అధికారులు ఆదివారం నాడు నగదుకు సంబంధించిన తనిఖీలు చేయగా ఈ వ్యవహారం బట్టబయలయ్యింది. దీని వెనుక సిఎంఎస్కు చెందిన ఇద్దరు ఉద్యోగుల హస్తం వుందని ఫిర్యాదు అందడంతో వారి కోసం పోలీసులు గాలింపు చేబట్టారు.

Read Also: Cotton Farmers : పత్తి రైతులకు కేంద్రం గొప్ప శుభవార్త

 Two employees abscond with Rs 1.20 crore cash kept in ATMs

Hyderabad ATM Theft: నగదు నింపే క్రమంలో మోసం

సిఎంఎస్ సంస్థ దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సంబంధించిన నగదును ఆయా బ్యాంకుల ఎటిఎంలలో భద్రపరుస్తుండడం తెలిసిందే. బ్యాంకుల నుంచి నగదు తీసుకుని వాటిని సాయుధ భద్రత మధ్య ఎటిఎం కేంద్రాలలో భద్రంగా వుంచడం సిఎంఎస్ బాధ్యత. ఇందుకోసం సిఎంఎస్ సంస్థల్లో భారీగా ఉద్యోగులు వుంటారు. ఒకసారి ఎటిఎంలో నగదు వుంచాక వాటిలో ఏదైనా తేడా వుంటే వెంటనే తెలుసుకునే అవకాశం వుం డక పోవడం కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. ఇదే క్రమంలో గతంలో అనేకమార్లు సిఎంఎస్ ఉద్యోగులు ఎటిఎంలలో వుంచాల్సిన నగ దును కొన్ని రోజుల పాటు సొంత అవసరాలకు వాడుకోవడం, వడ్డీలకు తిప్పడం, లేదా దోచుకుని ఉదాయించడం చేశారు.

తనిఖీల్లో బయటపడ్డ బాగోతం

ఇలాంటి ఘటన ఆదివారం ఎస్ఆర్ నగర్ పరిధిలో వెలుగు చూసింది. ఎస్ఆర్ నగర్ పరిధిలో గల అనేక ఎటిఎంలలో ఇటీవలే సిఎంఎస్ సంస్థ పది కోట్ల రూపాయలకు పైగా నగదును వుంచింది. తాము నగదు భద్రపరచిన ఎటిఎంలను శనివారం నుంచి సిఎంఎస్ అధికారులు వరుసగా తనిఖీలు చేస్తూ ఎస్ఆర్ నగర్ పరిధిలోని 31 ఎటిఎంలలో పరిశీలన చేశారు. ఇందులో ఎస్బీఐ సహా పలు బ్యాంకులకు చెందిన ఎనిమిది ఎటిఎంలలో కో 20 లక్షల 98 వేల 500 రూపాయలు తక్కువ వున్నట్లు తేలింది. డబ్బుల వినియోగదారులు తీసుకోక పోవడం, ఎటిఎంలజి లేకపోవడంతో ఇది ఉద్యోగుల చేతివాటం. సిఎంఎస్ సంస్థ అధికారులు గుర్తించారు.

నిందితుల కోసం పోలీసుల గాలింపు

దీని అంతర్గతంగా విచారణ చేయగా ఈ ప్రాంతంజి ఎటిఎంలలో నగదు వుంచే ఇద్దరు ఉద్యోగుల వారం రోజులుగా విధుల్లోకి రావడం లేదని, మీ సెల్ఫోన్లు స్విచాఫ్ వున్నాయని తేలింది. గోల్మాల్ కు వీరే కారకులని అధికారు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై సిఎంఎస్ ఇన్ సిస్టం లిమిటెడ్ సంస్థ మేనేజర్ నవీన్ ఫిర్యాడా మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఆర్ నగు పోలీసులు విచారణ చేబట్టి అనుమానితుల కోస ఆరా తీస్తున్నారు. అనుమానితుల సెల్ఫోన స్విచాఫ్ వుండడంతో వీటి లొకేషన్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. దీంతో పాటు ఎస్‌ఆర్ నగర్ లో గల ఎటిఎంలలో వున్న సిసిటివి ఫుటేజిలను పరిశీలిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

శాంతినగర్‌లో సిలిండర్ పేలుడు… నలుగురికి తీవ్ర గాయాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha