Srisailam Elevated Corridor Construction: శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు ఇకపై ప్రయాణం మరింత సులభతరం కానుంది.
ప్రతి ఏటా పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఘాట్ రోడ్డులో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగా శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
Read Also: Vizianagaram Crime: కాలిఫోర్నియాలో విజయనగరం యువకుడి మృతి!
Srisailam Elevated Corridor Construction: వన్యప్రాణులకు ఆటంకం లేకుండా డిజైన్
శ్రీశైలం దేవస్థానం నల్లమల అటవీ ప్రాంతంలో ఉండటంతో, ఇక్కడి వన్యప్రాణుల రక్షణ అత్యంత కీలకం. ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అటవీ శాఖ నిబంధనలకు అనుగుణంగా, జంతువుల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఎత్తైన స్తంభాలపై ఈ రహదారిని నిర్మించనున్నారు. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండానే భక్తులకు వేగవంతమైన ప్రయాణం అందుతుంది.
Srisailam Elevated Corridor
హైదరాబాద్ వైపు నుంచి ఇటు ఏపీలో దోర్నాల వరకు నల్లమల అటవీ ప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతాలు ఉన్నాయి. అందుకే ఏపీలో 41.39 కిలోమీటర్లు.. తెలంగాణ పరిధిలో 45.35 కిలోమీటర్లు కలిపి మొత్తం 86.74 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ నాలుగు లైన్లుగా ప్లాన్ చేశారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు రూ.18,500 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఏపీ పరిధిలో రూ.10,500 కోట్లు.. తెలంగాణ పరిధిలో రూ.8వేల కోట్లు వ్యయం అవుతుందంటున్నారు. ఇప్పటికే కృష్ణా నదిపై ప్రస్తుతం వంతెన ఉంది.. అయితే డ్యామ్‌కు మధ్యలో 450 మీటర్లు కొత్త ఐకానిక్ బ్రిడ్జి నిర్మించనున్నారు. అలాగే శ్రీశైలం క్రాస్ రోడ్ దగ్గర నుంచి ఆలయం వరకు 4.33 కిలోమీటర్ల పొడవున స్పర్ రోడ్ కూడా ప్లాన్ చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

