Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దళపతికి టాలీవుడ్ విషెస్! విజయ్ గెలుపుపై రాజశేఖర్ ఏమన్నారంటే?

దళపతికి టాలీవుడ్ విషెస్! విజయ్ గెలుపుపై రాజశేఖర్ ఏమన్నారంటే?

వార్త 1 month ago

Rajasekhar Tweet on Vijay: తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సాధించిన చారిత్రాత్మక విజయంపై టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ చేసిన ట్వీట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వెళ్లడంపై రాజశేఖర్‌కు ఉన్న అవగాహనతో ఆయన చేసిన విశ్లేషణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Read Also:Trisha Birthday Special:విశ్వంభర'లో అవనిగా త్రిష.. మెగాస్టార్ సినిమా నుంచి బర్త్ డే సర్ప్రైజ్!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన ఘనవిజయంపై టాలీవుడ్ సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ స్పందించారు. విజయ్ భవిష్యత్తులో ఒక బలమైన ప్రతిపక్షంగా ఎదుగుతారని తాను మొదట భావించానని, కానీ ఇప్పుడు వచ్చిన ఫలితాలు తన ఊహకు అందడం లేదని ఆయన పేర్కొన్నారు.రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే 110కి పైగా సీట్లలో ఆధిక్యం సాధించి, అధికార పీఠాన్ని దక్కించుకోవడం అనేది ఒక అద్భుతమని రాజశేఖర్ కొనియాడారు. “విజయ్ సాధించిన ఈ ఫలితాలు నిజంగా నమ్మశక్యం కాని రీతిలో ఉన్నాయి. ప్రజల మద్దతు పొందిన నాయకుడిగా ఆయన ఎదిగిన తీరు అభినందనీయం” అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Rajasekhar Tweet on Vijay: కొత్త శకానికి నాంది

సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి సక్సెస్ సాధించడం ఇతర సినీ ప్రముఖులకు కూడా స్ఫూర్తినిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఆయన ప్రజలకు మరింత సేవ చేయాలని, దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనపై ఉండాలని రాజశేఖర్ ఆకాంక్షించారు. పొరుగు రాష్ట్రాల సినీ పెద్దలు కూడా విజయ్ విజయాన్ని ఇంతలా ఓన్ చేసుకోవడం విశేషం.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మే 8న 'జననాయగన్' జాతర! లీక్ అయినా సరే రికార్డులు తిరగరాయడం ఖాయం..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha