Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మే 8న 'జననాయగన్' జాతర! లీక్ అయినా సరే రికార్డులు తిరగరాయడం ఖాయం..

మే 8న 'జననాయగన్' జాతర! లీక్ అయినా సరే రికార్డులు తిరగరాయడం ఖాయం..

వార్త 1 month ago

Jananayagan movie release: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న దళపతి విజయ్, తన రాజకీయ ప్రవేశం కోసం నటించిన ఆఖరి చిత్రం 'జననాయగన్' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సెన్సార్, ఇతర సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా, విజయ్ ఎన్నికల విజయం తర్వాత చకచకా అడ్డంకులను దాటేసింది. మే 8న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజా సమాచారం.

Read Also: Peddi Movie Trailer: 'పెద్ది' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్?

Jananayagan movie release: లీక్ అయినా తగ్గని క్రేజ్

సాధారణంగా ఏదైనా సినిమా ఆన్‌లైన్‌లో లీక్ అయితే దాని ప్రభావం వసూళ్లపై పడుతుంది. కానీ ‘జననాయగన్’ విషయంలో పరిస్థితి రివర్స్‌లో ఉంది. సినిమా లీక్ అయినప్పటికీ, విజయ్ సాధించిన చారిత్రాత్మక విజయం కారణంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లలోనే చూడాలని ఫిక్స్ అయిపోయారు. ప్రపంచ సినీ చరిత్రలోనే లీక్ అయిన ఒక సినిమా 'ఇండస్ట్రీ హిట్'గా నిలవడం ఇదే మొదటిసారి అవుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 Jananayagan movie

విజయ్ కొత్త ముఖ్యమంత్రిగా రాబోతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సినిమాల ప్రదర్శన సమయాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అభిమానుల కోరిక మేరకు రాష్ట్రవ్యాప్తంగా అర్లీ మార్నింగ్ షోలకు (AM Shows) అనుమతినిస్తూ కొత్త జీవో విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక జరిగితే, మొదటి రోజే ‘జననాయగన్’ బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తుడిచిపెట్టడం ఖాయం.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

విశ్వంభర'లో అవనిగా త్రిష.. మెగాస్టార్ సినిమా నుంచి బర్త్ డే సర్ప్రైజ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha