Dailyhunt
దళిత మహిళపై జనసేన నేత దాడి.. పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్తత

దళిత మహిళపై జనసేన నేత దాడి.. పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్తత

వార్త 2 weeks ago

Pithapuram Janasena Leader Attack: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీ నాయకుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో జరిగిన ఒక సివిల్ సెటిల్‌మెంట్‌లో జనసేన నేత బారతాల గోవింద్ తలదూర్చడమే కాకుండా, ఒక దళిత మహిళపై భౌతిక దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read Also: YSRCP Protest Tirupati: "బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి".. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసన

మహిళపై అనుచిత ప్రవర్తన.. నేలపైకి నెట్టేసిన వైనం

తాటిపర్తిలో జరిగిన ఈ వివాదంలో జోక్యం చేసుకున్న గోవింద్, బాధితురాలి పట్ల అత్యంత అనాగరికంగా ప్రవర్తించారని ఆరోపణలు వస్తున్నాయి. మహిళ శరీరంపై అనుచితంగా చేయి వేసి, ఆమెను బలవంతంగా నేలపైకి నెట్టివేసినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. బహిరంగంగానే ఒక మహిళపై ఇలాంటి దాడికి పాల్పడటం పట్ల స్థానిక ప్రజలు మరియు మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Pithapuram Janasena Leader Attack: వరుస ఘటనలు.. మహిళా రక్షణపై వెల్లువెత్తుతున్న విమర్శలు

రాష్ట్రంలో మహిళలకు, ముఖ్యంగా దళిత మహిళలకు రక్షణ కరువైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇటీవల రైల్వేకోడూరులో ఒక దళిత మహిళపై జనసేన ఎమ్మెల్యే అనుచరుడు దాడి చేసిన ఘటన మరువక ముందే, ఇప్పుడు పిఠాపురంలో మరో ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన వారు, ఇప్పుడు తమ పార్టీ నాయకులే దాడులకు పాల్పడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు కొనసాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha