Minister Seethakka:అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ఈ కీలక విషయాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేద కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
Read also: Khammam News: అయ్యో ఎంత పని జరిగింది.. విద్యుత్ షాక్‌తో 9 నెలల చిన్నారి మృతి
Welfare schemes for every eligible person
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పదిహేను లక్షల రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు అలాగే కొత్త రేషన్ కార్డులు అన్నీ కూడా మహిళల పేరు మీదే అందజేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. దీనివల్ల కుటుంబంలో మహిళలకు సమాజంలో గుర్తింపుతో పాటు ఆర్థిక భద్రత కూడా చేకూరుతుందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది.
Minister Seethakka:త్వరలోనే నూతన సామాజిక పింఛన్ల పంపిణీ
రాబోయే పది నుంచి పదిహేను రోజుల్లోగా అర్హులైన వారందరికీ కొత్త సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందుతాయని భరోసా కల్పించారు.
Epaper: epaper.vaartha.com

