Dailyhunt
డేకేర్ సెంటరా లేక నరకకూపమా? కాళ్లు చేతులు కట్టేసి పసిపిల్లల నగ్న ప్రదర్శన!

డేకేర్ సెంటరా లేక నరకకూపమా? కాళ్లు చేతులు కట్టేసి పసిపిల్లల నగ్న ప్రదర్శన!

వార్త 1 week ago

Indonesia Daycare Abuse: ఇండోనేషియాలో సభ్య సమాజం తలదించుకునేలా ఒక దారుణ ఘటన వెలుగుచూసింది. అమ్మానాన్నలు నమ్మి వదిలివెళ్లిన పసిపిల్లలపై డేకేర్ సెంటర్ సిబ్బంది రాక్షసత్వాన్ని ప్రదర్శించారు.

యోగ్యకర్తలోని ఒక డేకేర్ సెంటర్లో పసిపాపలను చిత్రహింసలకు గురిచేస్తున్న తీరు చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

Read Also :ISIS: నైజీరియాలో ఐసిస్ బీభత్సం: 29 మంది పౌరుల కాల్చివేత

 Atrocities against 53 Children

53 మంది చిన్నారులపై రాక్షసత్వం

ఆ డేకేర్ సెంటర్లో మొత్తం 103 మంది పిల్లలు ఉండగా, అందులో దాదాపు 53 మంది చిన్నారులు సిబ్బంది చేతుల్లో ఘోరమైన హింసకు గురైనట్లు విచారణలో తేలింది. పిల్లలు ఏడవకుండా ఉండటానికి వారి నోట్లో బలవంతంగా గుడ్డలు కుక్కడం, కాళ్లు చేతులు కట్టేసి పక్కన పడేయడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడ్డారు. పసిపిల్లల పట్ల కనీసం జాలి లేకుండా సిబ్బంది ప్రవర్తించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Indonesia Daycare Abuse: 13 మంది అరెస్ట్.. మరణశిక్షకు డిమాండ్

ఈ దారుణం బయటపడటంతో పోలీసులు తక్షణమే స్పందించి, ఆ డేకేర్ సెంటర్‌కు చెందిన 13 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో సెంటర్ యజమానితో పాటు పిల్లలను హింసించిన సిబ్బంది కూడా ఉన్నారు. ఈ క్రూరత్వానికి పాల్పడిన నిందితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాభిక్ష పెట్టకూడదని, వారికి మరణశిక్ష విధించాలని బాధితుల తల్లిదండ్రులు మరియు స్థానికులు రోడ్లపైకి వచ్చి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సెంటర్‌ను మూసివేసిన అధికారులు, మిగిలిన పిల్లల ఆరోగ్యం మరియు మానసిక స్థితిపై నిపుణులతో తనిఖీలు చేయిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

అమ్మాయిని కౌగిలించుకున్న రోబో.. అసలేం జరిగిందంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha