Dailyhunt
నైజీరియాలో ఐసిస్ బీభత్సం: 29 మంది పౌరుల కాల్చివేత

నైజీరియాలో ఐసిస్ బీభత్సం: 29 మంది పౌరుల కాల్చివేత

వార్త 1 week ago

శ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఉగ్రవాదం మరోసారి పడగ విప్పింది. అడమావా రాష్ట్రంలో జరిగిన ఘోర కలివిడిలో 29 మంది ప్రాణాలు కోల్పోవడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.

అడమావా రాష్ట్రంలోని గోంబి స్థానిక ప్రభుత్వ పరిధిలో ఉన్న గుయాకు కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. చీకటి పడిన తర్వాత మిలిటెంట్లు భారీ ఆయుధాలతో గ్రామంలోకి ప్రవేశించారు.
అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగు తీసిన పౌరులను వెంబడించి మరీ కాల్చి చంపారు. ఈ దాడులకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ (ISIS) తన అధికారిక టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ప్రకటించింది.

Read Also: Putin Iran : శాంతికి రష్యా కృషి… పుతిన్ కీలక ప్రకటన

 ISIS

ISIS: నైజీరియాలో కొనసాగుతున్న భద్రతా సంక్షోభం

గత రెండు దశాబ్దాలుగా నైజీరియా తీవ్రమైన అంతర్గత భద్రతా సమస్యలతో సతమతమవుతోంది. ఈశాన్య ప్రాంతంలో ‘ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్’ (ISWAP), ఉత్తర-మధ్య ప్రాంతాల్లో ‘లకురావా’ వంటి గ్రూపులు నిరంతరం దాడులు చేస్తున్నాయి. ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి పాఠశాల పిల్లలను, అనాథాశ్రమాలపై దాడులు చేసి చిన్నారులను కిడ్నాప్ చేయడం ఈ ముఠాలకు పరిపాటిగా మారింది. ఇటీవల ఓ అనాథాశ్రమం నుండి 23 మంది చిన్నారులను అపహరించగా, అందులో 15 మందిని మాత్రమే రక్షించగలిగారు. పరిస్థితిని అదుపు చేయడానికి నైజీరియా సైన్యానికి తోడుగా అమెరికా తన సైనిక బలగాలను అక్కడకు పంపింది. నైజీరియాలో కేవలం ఉగ్రవాదమే కాకుండా, అంతర్గత వర్గ పోరు కూడా ప్రాణనష్టానికి దారితీస్తోంది. ముస్లిం ఫులానీ పశువుల కాపరులకు, క్రైస్తవ వ్యవసాయ వర్గాలకు మధ్య భూమి మరియు పశువుల మేత విషయంలో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ఇటీవల ఈస్టర్ వేడుకల సమయంలో జరిగిన వేర్వేరు దాడుల్లో దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రార్థనాలయాలు, పోలీస్ స్టేషన్లే లక్ష్యంగా ఈ దాడులు జరగడం గమనార్హం. అడమావా గవర్నర్ అహ్మదు ఉమారు ఫింటిరి బాధితులను పరామర్శించి, ఈ దాడిని అత్యంత హేయమైన చర్యగా ఖండించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

జుబాలో విమానం కూలి 14 మంది దుర్మరణం?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha