Huge Financial Scam : భారతీయ కార్పొరేట్ రంగంలో మునుపెన్నడూ వినని రీతిలో ఒక భారీ ఆర్థిక కుంభకోణం వెలుగుచూసింది. దేశంలోనే అతిపెద్ద బంగారం శుద్ధి మరియు జ్యువెలరీ తయారీ సంస్థల్లో ఒకటైన బెంగళూరుకు చెందిన 'రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్' (Rajesh Exports) ఇంతటి మహా మోసానికి పాల్పడినట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) తన 109 పేజీల మధ్యంతర ఉత్తర్వులలో బట్టబయలు చేసింది.
2021 నుండి 2025 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఈ కంపెనీ తమ విదేశీ అనుబంధ సంస్థలు (Subsidiaries), ముఖ్యంగా స్విట్జర్లాండ్‌కు చెందిన ‘వాల్‌కంబి’ (Valcambi SA) ద్వారా ఏకంగా ₹15.15 లక్షల కోట్ల మేర దొంగ రికార్డులను సృష్టించి, అదనపు ఆదాయాన్ని (Revenue) చూపించినట్లు సెబీ దర్యాప్తులో తేలింది. కంపెనీ చూపించిన మొత్తం అంతర్జాతీయ ఆదాయంలో దాదాపు 99.8 శాతం నకిలీదేనని నిర్ధారణ కావడంతో, సెబీ ఈ వ్యవహారాన్ని అత్యంత తీవ్రమైనదిగా పరిగణించింది. ఈ ఘోర ఆర్థిక అక్రమాలకు బాధ్యుడిగా చేస్తూ కంపెనీ ప్రమోటర్ కమ్ ఛైర్మన్ రాజేశ్ మెహతాపై మరియు సదరు కంపెనీపై స్టాక్ మార్కెట్లలో లావాదేవీలు జరపకుండా సెబీ తక్షణ నిషేధం విధించింది.
Read Also : ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

ఒక్క ఇన్వెస్టర్ ఫిర్యాదుతో కదిలిన డొంక.. కుప్పకూలిన షేరు విలువ!
ఈ మహా కుంభకోణం వెలుగుచూడటానికి 2024 లో ఒక చిన్న ఇన్వెస్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారమైంది. కంపెనీ పుస్తకాల్లోని ట్రేడ్ రిసీవబుల్స్ (రావాల్సిన బాకీలు) రెండేళ్లకు పైగా పెండింగ్‌లో ఉండటాన్ని సదరు ఇన్వెస్టర్ గుర్తించి ఫిర్యాదు చేయడంతో, సెబీ ఫోరెన్సిక్ ఆడిటింగ్‌కు ఆదేశించింది. ఈ విచారణలో కేవలం బోగస్ బిల్లులే కాకుండా, బోర్డు మరియు ఆడిట్ కమిటీ అనుమతి లేకుండానే సుమారు ₹339 కోట్ల కంపెనీ నిధులను రాజేశ్ మెహతా తన వ్యక్తిగత ఖాతాలకు మళ్లించి డెరివేటివ్స్ ట్రేడింగ్ చేసినట్లు కూడా ఆధారాలు దొరికాయి. గడిచిన మూడేళ్ల కాలంలో ఈ కంపెనీ అంతర్గత లోపాలు బయటపడుతూ రావడంతో స్టాక్ మార్కెట్లో దీని షేరు విలువ ఏకంగా 90 శాతానికి పైగా పడిపోయింది. దీనివల్ల ఎల్‌ఐసీ (LIC) వంటి దిగ్గజ సంస్థలతో పాటు లక్షలాది మంది సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు దాదాపు ₹12,726 కోట్ల మేర సంపదను కోల్పోయి రోడ్డున పడ్డారు. అటు సెబీ నిషేధంతో పాటు ఇటు కెనరా బ్యాంక్ కూడా ఈ కంపెనీపై అప్పుల రికవరీ కోసం దివాలా పిటిషన్ దాఖలు చేయడంతో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ సంక్షోభం మరింత ముదిరింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

