Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేశవ్యాప్తంగా 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..షెడ్యూల్ ఇదే

దేశవ్యాప్తంగా 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..షెడ్యూల్ ఇదే

వార్త 1 week ago

Rajya Sabha Election schedule: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 27 రాజ్యసభ స్థానాలతో పాటు మూడు రాష్ట్రాలలోని శాసనమండలి (MLC) స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) సోమవారం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ నోటిఫికేషన్ విడుదలతోనే ఆయా స్థానాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం ఉదయం 11 గంటల నుంచి లాంఛనంగా ప్రారంభమైంది.

 Election Commission of India

జూన్ 18న పోలింగ్.. ఎన్నికల పూర్తి షెడ్యూల్ ఇదే!

ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయడానికి జూన్ 8వ తేదీ వరకు గడువు ఉంటుంది. జూన్ 9న ఈ నామినేషన్ల స్క్రూటినీ (పరిశీలన) ప్రక్రియ జరుగుతుంది. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి జూన్ 11 వరకు సమయం ఇచ్చారు. అనంతరం జూన్ 18న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ ముగిసిన వెంటనే, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు.

Read also: Chhattisgarh : డ్రైవర్ కుమార్తెను పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యే

Rajya Sabha Election schedule: పది రాష్ట్రాల్లో ద్వైవార్షిక ఎన్నికలు.. మూడు చోట్ల ఉప ఎన్నికలు!

రాజ్యసభ స్థానాల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలలో కలిపి మొత్తం 24 స్థానాలకు ద్వైవార్షిక (Biennial) ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలలోని ఒక్కో రాజ్యసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలను (By-Elections) నిర్వహించనుంది.

బీహార్, కర్ణాటకల్లో శాసనమండలి సమరం

మరోవైపు శాసనమండలి స్థానాల భర్తీ ప్రక్రియ కూడా వేగవంతమైంది. బీహార్‌లో 9 స్థానాలకు, కర్ణాటకలో 7 స్థానాలకు ద్వైవార్షిక ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన ఒక ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఇదే షెడ్యూల్ ప్రకారం ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో మంత్రి లోకేష్ భేటీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha