Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థుల పట్ల తనకున్న ప్రత్యేక శ్రద్ధను, మానవతా దృక్పథాన్ని మరోసారి నిరూపించుకున్నారు. నీట్-యూజీ (NEET-UG) రాసే అభ్యర్థులకు తన కాన్వాయ్ వల్ల ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో ఆయన ఢిల్లీ విమానాశ్రయంలోనే దాదాపు గంట కాలం పాటు వేచి ఉన్నారు.
ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురుస్తోంది.

కాన్వాయ్ ఆపేసి.. ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయిన ప్రధాని
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా కోల్‌కతాలో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి తిరుగుపయనమై ఆదివారం మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో ఆయన ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన విమానాశ్రయం నుండి నేరుగా తన అధికారిక నివాసానికి వెళ్లాల్సి ఉంది.
read also: Tamil Nadu Gas Leak: తమిళనాడులో విషాదం.. అమ్మోనియా గ్యాస్ లీకై ఏడుగురి మృతి
అయితే అదే రోజు మధ్యాహ్నం 2:00 గంటలకు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. ఆ సమయానికి విద్యార్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకునే హడావుడిలో ఉంటారు. ఈ తరుణంలో తన విఐపి కాన్వాయ్ రోడ్లపైకి వస్తే ట్రాఫిక్ నిలిచిపోయి, విద్యార్థులు సకాలంలో సెంటర్లకు చేరుకోలేరని ప్రధాని భావించారు. అందుకే ఎగ్జామ్ మొదలయ్యే వరకు విమానాశ్రయం వెలుపలికి రాకూడదని స్వయంగా నిర్ణయించుకున్నారు. పరీక్ష ప్రారంభమైన తర్వాతే (మధ్యాహ్నం 2 గంటల దాటాక) ఆయన ఎయిర్‌పోర్ట్ నుంచి తన నివాసానికి బయలుదేరారు.
Narendra Modi: కట్టుదిట్టమైన భద్రత నడుమ నీట్ పరీక్ష
మరోవైపు, దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు కఠిన నిబంధనల నడుమ ఈ నీట్ పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ.. విద్యార్థులెవరూ ఒత్తిడికి గురికాకుండా, ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని పిలుపునిచ్చారు. జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA)తో పాటు రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాట్లపై తనకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. అలాగే యువత భవిష్యత్తుతో ఆడుకోవాలని చూసే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:

