Kakinada News: కాకినాడ జిల్లా సామర్లకోటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుమారరామ భీమేశ్వరస్వామి గుడి దగ్గర పిడుగు పడటంతో అర్జున్‌రావు (63) అనే కౌలు రైతు అక్కడికక్కడే చనిపోయారు.
ఆకాశం మేఘావృతమై వర్షం మొదలవడంతో, ఆందోళనతో తన కష్టాన్ని కాపాడుకోవాలని ఆయన ప్రయత్నించారు. ప్రకృతి వైపరీత్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
Read also: Visakhapatnam Crime: ఆరోగ్యం పేరుతో అసభ్యం.. స్పాల్లో వ్యభిచార ముఠాలు గుట్టు రట్టు
Farmer death by lightning in Kakinada
Kakinada News: ధాన్యం కాపాడబోయి అనంతలోకానికి
అర్జున్‌రావు పండించిన ధాన్యం వర్షానికి తడవకుండా ఉండేందుకు తార్పాలిన్ పట్టాలు కప్పుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మరణించారని ధృవీకరించారు. కళ్లముందే రైతు ప్రాణాలు కోల్పోవడంతో తోటి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
రాగంపేటలో విషాద చాయలు
మృతుడు పెద్దాపురం మండలం జి. రాగంపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పొట్టకూటి కోసం కౌలుకు సాగు చేస్తూ, అకాల వర్షం నుంచి పంటను రక్షించుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కష్టపడి పండించిన పంటను కాపాడుకోబోయి రైతు ప్రాణాలు వదలడం అందరినీ కలిచివేస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com

