Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధనుష్ లేటెస్ట్ థ్రిల్లర్ 'కర'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ధనుష్ లేటెస్ట్ థ్రిల్లర్ 'కర'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

వార్త 1 day ago

Kara OTT release date: ప్రస్తుతం ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్‌లలోకి సరికొత్త కంటెంట్ ఉన్న చిత్రాలు వరుసగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తున్న సంగతి తెలిసిందే.

థియేటర్లలో విడుదలైన సినిమాలు సైతం కేవలం 45 రోజుల్లోనే, కొన్ని సందర్భాల్లో నెల రోజుల్లోనే డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేస్తున్నాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ హెయిస్ట్ థ్రిల్లర్ మూవీ 'కర' ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. అటు తమిళం, ఇటు తెలుగు భాషలలో మంచి క్రేజ్ ఉన్న ధనుష్ నటించిన ఈ సినిమా ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన 'కర' చిత్రానికి ఆల్ఫ్రెడ్ ప్రకాష్ సహ రచయితగా పనిచేశారు. ఎన్నో భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు రూ. 41 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించింది.

Read Also : Rukmini Vasanth: 'అవి ఫేక్ వీడియోలు'.. స్విమ్మింగ్ పూల్ ఫొటోలపై రుక్మిణి వసంత్ ఆగ్రహం

 Dhanush’s latest thriller ‘Kara’.. When will it be streaming?

థియేటర్ రన్ ముగియడంతో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ఖరారు చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) యాప్‌లో 'కర' సినిమా స్ట్రీమింగ్ వివరాలను పొందుపరిచారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం మే 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగుతో పాటు దక్షిణాదిలోని ఇతర ప్రధాన భాషల్లో కూడా ఈ చిత్రం వీక్షించడానికి అందుబాటులో ఉంటుంది. ఈ చిత్రంలో ధనుష్ సరసన మమితా బైజు కథానాయికగా నటించగా.. జయరామ్, కేఎస్ రవికుమార్, కరుణాస్, సూరజ్ వెంజరమూడు, ఎంఎస్ భాస్కర్ కీలక పాత్రలు పోషించారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

Kara OTT release date: కథేంటంటే?

1991 గల్ఫ్ యుద్ధ సమయంలో తమిళనాడులో తీవ్ర ఇంధన (పెట్రోల్/డీజిల్) సంక్షోభం తలెత్తుతుంది. ఆ సమయంలో కరసామి అలియాస్ కర (ధనుష్) అనే ఒక దొంగ తన జీవనోపాధి కోసం పోరాడుతుంటాడు. అయితే తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న మల్లి (మమితా బైజు) కోసం ఎలాగైనా తన దొంగతనాలు, నేర జీవితాన్ని వదిలేసి కష్టపడి మంచిగా బతకాలని నిర్ణయించుకుంటాడు.

సొంతంగా ఒక హోటల్ పెట్టాలనే ఆశతో, ఊరిలో ఉన్న తన పొలం కాగితాలను బ్యాంకులో తాకట్టు పెట్టాలని భావిస్తాడు. ఆ కాగితాల కోసమే చాలా సంవత్సరాల తర్వాత తన తండ్రి (కేఎస్ రవికుమార్) వద్దకు వెళతాడు. కానీ అక్కడ ఊహించని విధంగా తన తండ్రిని కోల్పోవాల్సి వస్తుంది. ఆ తర్వాత కరస్వామి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అతని జీవితంలోకి ముత్తు సెల్వన్ (జయరామ్) ఎలా వచ్చాడు? చివరకు కర అనుకున్నది సాధించాడా లేదా? అనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం. థియేటర్లలో మిస్ అయిన వారు మే 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ థ్రిల్లర్ మూవీని హ్యాపీగా చూసేయొచ్చు

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పెద్ది సెన్సార్ రివ్యూ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha