Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధర్మస్థల కేసులో తన పేరు రావడంపై స్పందించిన ప్రకాశ్ రాజ్

ధర్మస్థల కేసులో తన పేరు రావడంపై స్పందించిన ప్రకాశ్ రాజ్

వార్త 2 months ago

Prakash Raj: కర్ణాటకను కుదిపేస్తున్న 'ధర్మస్థల సామూహిక ఖననాల కేసు'లో తన పేరు తెరపైకి రావడంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఈ వివాదానికి సంబంధించిన ఆరోపణలపై త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తానని ఆయన ప్రకటించారు.

కర్ణాటక హైకోర్టులో దాఖలైన ఒక రిట్ పిటిషన్‌లో తన పేరు ప్రస్తావనకు రావడంతో, ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.

 Dharmasthala Case

‘ఎక్స్’ వేదికగా ప్రకాశ్ రాజ్ వివరణ

ఈ వివాదంపై ప్రకాశ్ రాజ్ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా కన్నడలో ఒక ప్రకటన విడుదల చేశారు. “ధర్మస్థల కేసు విషయంలో మీడియా, సోషల్ మీడియా వేదికల్లో నాపై వస్తున్న వార్తలను గమనించాను. ఇది అత్యంత సున్నితమైన అంశం మాత్రమే కాదు, లక్షలాది మంది భక్తుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న వ్యవహారం. అందుకే దీనిపై స్పందించడం నా బాధ్యతగా భావిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.

Read also: CJP announces 'Exam Manifesto' : 'పరీక్షల మేనిఫెస్టో'ను ప్రకటించిన CJP: నీట్ వివాదంపై దేశవ్యాప్త నిరసనలు

Prakash Raj: రెండు రోజుల్లో మీడియా ముందుకు..

ప్రస్తుతం తాను అందుబాటులో లేనందున, మరో రెండు రోజుల్లో స్వయంగా మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలను వెల్లడిస్తానని ప్రకాశ్ రాజ్ తెలిపారు. అంతవరకు సామాజిక మాధ్యమాల్లో వచ్చే గాలి వార్తలను, కొందరు వ్యక్తులు ప్రచారం చేస్తున్న కల్పిత కథనాలను నమ్మవద్దని ఆయన అభిమానులను, ప్రజలను కోరారు.

అసలు ఏమిటీ ధర్మస్థల కేసు?

ధర్మస్థల ఆలయ పరిసర ప్రాంతాల్లో గత రెండు దశాబ్దాలుగా వందలాది మృతదేహాలను రహస్యంగా ఖననం చేశారంటూ గత ఏడాది (2025) ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ సమయంలో శవాల ఖననం కోసం తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన పేర్కొనడంతో కర్ణాటక ప్రభుత్వం ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఆయా ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో అస్థిపంజరాలు బయటపడటంతో ఈ ఉదంతం తీవ్రరూపం దాల్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చిన్నయ్య అనే వ్యక్తి జూన్ 11న హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో ప్రకాశ్ రాజ్ పేరును చేర్చడంతో ఈ వ్యవహారం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ఆయిల్ మార్కెట్‌లో భారత్ మైండ్ గేమ్.. ఏమిటా ప్లాన్?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha