Dailyhunt
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్

వార్త 6 days ago

కాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తన వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) రక్షణ కోసం కీలక అడుగు వేశారు. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియోలు, సంతకం లేదా వాయిస్‌ను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా నిషేధం విధించాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై జస్టిస్ తుషార్ రావు గెడెల నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరపనుంది.

Read Also: Meenakshi Seshadri Dance Video: 34 ఏళ్ల తర్వాత అదే గ్రేస్.. అదే మ్యాజిక్

 Allu Arjun approaches Delhi High Court

ఏమిటీ పర్సనాలిటీ రైట్స్?

ప్రముఖ వ్యక్తుల గుర్తింపును (Identity) వారి అనుమతి లేకుండా అడ్వర్టైజ్‌మెంట్‌ల కోసం లేదా ఇతర వ్యాపారాల కోసం వాడటం చట్టరీత్యా నేరం. అల్లు అర్జున్ క్రేజ్‌ను వాడుకుని సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోలు సృష్టించడం, ఏఐ (AI) వాయిస్‌తో యాడ్స్ చేయడం వంటివి పెరిగిపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అమితాబ్, రజనీకాంత్ బాటలో..

గతంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి నటులు కూడా తమ వ్యక్తిత్వ హక్కుల కోసం కోర్టును ఆశ్రయించి అనుకూల తీర్పులు పొందారు. ఇప్పుడు అదే దారిలో అల్లు అర్జున్ తన బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకునేందుకు న్యాయపోరాటానికి దిగారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

'జన నాయగన్' మూవీ లీక్ కేసులో పురోగతి: ముగ్గురు ప్రధాన నిందితుల అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha