Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఢిల్లీలో భారీ పేలుళ్లకు స్కెచ్ వేసిన ఉగ్రవాదులు!

ఢిల్లీలో భారీ పేలుళ్లకు స్కెచ్ వేసిన ఉగ్రవాదులు!

వార్త 3 months ago

Delhi Terror Alert: దేశ రాజధానిలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ గూఢచారి సంస్థ 'ఐఎస్ఐ' (ISI) పన్నిన భయంకరమైన కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు.

ఢిల్లీ-సోనిపట్ హైవేపై ఉన్న ప్రముఖ దాబా, హర్యానాలోని మిలిటరీ క్యాంప్, ఢిల్లీలోని ఒక ప్రసిద్ధ ఆలయమే లక్ష్యంగా ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

Read Also :TVK ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్దపడ్డారా ?

Delhi Terror Alert: రంగంలోకి ‘షహజాద్ భట్’ మాడ్యూల్

జమ్మూకశ్మీర్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షహజాద్ భట్ నేతృత్వంలోని మాడ్యూల్‌ను ఈ దాడుల కోసం ఐఎస్ఐ రంగంలోకి దించింది. ఈ కుట్రపై పక్కా సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అధికారులు, మెరుపు దాడులు నిర్వహించి 9 మంది అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.

రెక్కీ నిర్వహించి వీడియోలు పంపి..

పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్టయిన వారిలో ఒక నిందితుడు ఢిల్లీలోని ప్రముఖ ఆలయం వద్ద రెక్కీ నిర్వహించాడు. అక్కడి భద్రత, భక్తుల రద్దీని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా ద్వారా పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లకు పంపాడు. రద్దీగా ఉండే సమయాల్లో ఆలయంలోకి ప్రవేశించి, భక్తులు, భద్రతా సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరపాలని వీరు ప్లాన్ చేశారు. మిలిటరీ క్యాంప్‌లతో పాటు, హైవేపై రద్దీగా ఉండే దాబాలను టార్గెట్ చేయడం ద్వారా ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలని కుట్ర పన్నారు. షహజాద్ భట్ అందిస్తున్న నిధులు, ఆదేశాల మేరకే ఈ స్థానిక ముఠా సభ్యులు దాడులకు సిద్ధమైనట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అరెస్టయిన 9 మందిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్న అధికారులు, ఈ నెట్‌వర్క్‌లో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పదవి పోయినా పీఠంపైనే మోజు.. మమత తీరుపై కేంద్ర మంత్రి ఎద్దేవా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha