Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పదవి పోయినా పీఠంపైనే మోజు.. మమత తీరుపై కేంద్ర మంత్రి ఎద్దేవా!

పదవి పోయినా పీఠంపైనే మోజు.. మమత తీరుపై కేంద్ర మంత్రి ఎద్దేవా!

వార్త 3 months ago

West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవ్వడంతో, 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు తెరపడింది.

గవర్నర్ ఆర్.ఎన్. రవి అసెంబ్లీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో మమతా బెనర్జీ అధికారికంగా ‘మాజీ ముఖ్యమంత్రి’ అయ్యారు.

Read Also :TVK ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్దపడ్డారా ?

అసెంబ్లీ రద్దు.. కేబినెట్ బర్తరఫ్

గురువారం సాయంత్రం గవర్నర్ నిర్ణయంతో రాష్ట్ర మంత్రివర్గం కూడా రద్దయింది. అయితే, పదవి కోల్పోయినప్పటికీ మమతా బెనర్జీ తన సోషల్ మీడియా ఖాతాలైన ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్‌లలో తన ప్రొఫైల్‌ను ఇంకా మార్చకపోవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికీ ఆమె తనను తాను ‘పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి’గానే పేర్కొంటున్నారు.

West Bengal: ఓటమిని అంగీకరించని మమత?

ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించగా, స్వయంగా మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో సువేందు అధికారి చేతిలో 15,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మే 5న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని, ఈ ఫలితాలు ప్రజా తీర్పును ప్రతిబింబించడం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.

బుద్ధదేవ్ వర్సెస్ మమత

ఈ పరిణామాలపై కేంద్ర సహాయ మంత్రి సుకాంత మజుందార్ స్పందిస్తూ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్యను ఉదాహరణగా చూపారు. 2011లో ఓటమి తెలియగానే అర్థరాత్రి రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించారని, తిరిగి తన సొంత పార్టీ కారులోనే ఇంటికి వెళ్లారని గుర్తు చేశారు. బుద్ధదేవ్ రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ, ఆయన నిజాయతీపరుడని, అధికారం కోసం పాకులాడలేదని కొనియాడారు. ఓటమిని హుందాగా స్వీకరించిన బుద్ధదేవ్‌కు, అధికారం పోయినా వదలని మమతకు అసలు పోలికే లేదని మజుందార్ ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక నాయకుడు ఓటమిని స్వీకరించిన తీరుకు, మరో నేత వ్యవహరిస్తున్న తీరుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

విజయ్‌కు హీరోయిన్ శ్రియ మద్దతు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha