Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఈ నెల 10న పలు రైళ్లు రద్దు!

రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఈ నెల 10న పలు రైళ్లు రద్దు!

వార్త 2 weeks ago

SCR Trains Cancelled: దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికులకు ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. కాజీపేట-బల్లార్ష రైల్వే మార్గంలోని జమ్మికుంట-పోత్కపల్లి స్టేషన్ల మధ్య 17 కిలోమీటర్ల పరిధిలో అత్యాధునిక ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుకు నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్నారు.

ఈ సాంకేతిక పనుల కారణంగా ఈ నెల 10న పలు రైళ్లను పూర్తిగా రద్దు చేయడమే కాకుండా, మరికొన్ని రైళ్ల సర్వీసులను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Read Also :Working for Free : ఎలాంటి జీతం లేకుండా ఫ్రీగా పనిచేసే వారు భారత్లోనే ఎక్కువ - సర్వే

SCR Trains Cancelledరద్దయిన రైళ్లు, పాక్షిక సర్వీసులు & ఆలస్యంగా నడిచే రైళ్ల పూర్తి వివరాలు

  • పూర్తిగా రద్దయిన రైలు:
    • కాజీపేట - సిర్పూర్ కాగజ్‌నగర్ (17003/04) రామగిరి మెమూ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 10న పూర్తిగా రద్దయింది.
  • పాక్షికంగా నడిచే రైళ్లు:
    • సింగరేణి ఎక్స్‌ప్రెస్ (17033/34): భద్రాచలం రోడ్డు - బల్లార్ష మధ్య నడిచే ఈ రైలు ఈ నెల 10న వరంగల్ - భద్రాచలం రోడ్డు మధ్య మాత్రమే నడుస్తుంది. (బల్లార్ష వైపు సర్వీస్ రద్దు).
    • ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (17011/12): హైదరాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే ఈ రైలు ఈ నెల 10న కాజీపేట - సికింద్రాబాద్ మధ్య మాత్రమే సర్వీస్ అందిస్తుంది.
  • రీషెడ్యూల్ అయిన రైలు:
    • భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (17233): సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు ఈ నెల 10న సాధారణ సమయం కంటే గంట ఆలస్యంగా బయలుదేరుతుంది.
  • ఆలస్యంగా నడిచే దూరప్రాంత రైళ్లు:
    • దానాపూర్ - ఎస్‌ఎంవీటీ బెంగళూరు (22365/66) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (ఈ నెల 9న)
    • చెన్నై సెంట్రల్ - శ్రీమాత వైష్ణోదేవి కాట్రా (16031) అండమాన్ ఎక్స్‌ప్రెస్ (ఈ నెల 10న)
    • ఢిల్లీ - చెన్నై సెంట్రల్ (12622) తమిళనాడు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (ఈ నెల 9న)

ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha