Dailyhunt
ఢిల్లీని చిత్తు చేసిన బెంగళూరు

ఢిల్లీని చిత్తు చేసిన బెంగళూరు

వార్త 1 week ago

DC vs RCB: ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు ఊచకోత కోశారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ బ్యాటర్లకు ఆర్సీబీ బౌలర్లు చుక్కలు చూపించారు.

క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఢిల్లీని కోలుకోలేని దెబ్బ తీశారు.

Read Also:Wasim Jaffer: పంత్‌కు కెప్టెన్సీ వద్దు.. మార్‌క్రమ్‌కు పగ్గాలు ఇవ్వండి: వసీం జాఫర్ షాకింగ్ కామెంట్స్

 RCB vs DC Match Highlights

DC vs RCB: బెంబేలెత్తించిన ఆర్సీబీ పేసర్లు

దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 75 పరుగులకే కుప్పకూలింది.ఇంప్యాక్ట్ సబ్‌ జాకబ్ బెథెల్‌(20)ను మూడో ఓవర్లోనే నటరాజన్ స్టన్నింగ్ క్యాచ్‌తో వెనక్కి పంపినా దేవ్‌దత్ పడిక్కల్‌(34 నాటౌట్), విరాట్ కోహ్లీ(23 నాటౌట్)దంచేశారు. జేమీసన్ ఓవర్లో పడిక్కల్ 6, 4, 6 తో స్కోర్ 60కి చేరింది. నటరాజ్ వేసిన 7వ ఓవర్లో కోహ్లీ వరసగా రెండు సిక్సర్లు బాదడంతో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

పవర్ ప్లేలోనే ఆర్సీబీ పేసర్లు భువనేశ్వర్(3-5), హేజిల్‌వుడ్‌(4-12) వికెట్ల వేటతో ఢిల్లీ బ్యాటర్లు సున్నాలు చుట్టేశారు. బంతిని స్వింగ్‌ చేస్తూ ఇద్దరూ వికెట్ల పండుగ చేసుకోగా 8 పరుగులకే ఆరు వికెట్లు పడ్డాయి. డేవిడ్ మిల్లర్‌(19), ఇంప్యాక్ట్ సబ్ అభిషేక్ పొరెల్(30) పోరాటంతో కోలుకునట్టే కనిపించినా.. హేజిల్‌వుడ్ యార్కర్‌తో అతడిని బౌల్డ్ చేయగా ఢిల్లీ ఇన్నింగ్స్ 16.3 ఓవర్లలోనే ముగిసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

టాస్ గెలిచిన బెంగళూరు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha