Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధోనీ స్టైల్‌లో ఫినిషింగ్.. ఎవరీ ముకుల్ చౌదరి?

ధోనీ స్టైల్‌లో ఫినిషింగ్.. ఎవరీ ముకుల్ చౌదరి?

వార్త 2 months ago

Mukul Choudhary: లక్నో సూపర్ జెయింట్స్ (LSG) యువ సంచలనం ముకుల్ చౌదరి నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌తో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు.

తన ఆరాధ్య దైవం ఎంఎస్ ధోనీ స్టైల్‌లో మ్యాచ్‌ను ఫినిష్ చేసి, జట్టుకు అసాధారణ విజయాన్ని అందించిన ఈ యువ ఆటగాడిపై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది.

Read Also:Mukul Chaudhary : ఒక్కసారిగా ట్రేండింగ్ లోకి ముకుల్ చౌదరి

లక్నో సూపర్ జెయింట్స్ యువ ఆటగాడు ముకుల్ చౌదరి నిన్న కోల్‌కతాపై ఆడిన వీరోచిత ఇన్నింగ్స్‌ను తన తండ్రికి, ఎంఎస్ ధోనీకి అంకితం ఇచ్చారు. కేవలం 27 బంతుల్లో 7 సిక్సర్లతో 54 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన ముకుల్, తన తండ్రి దలీప్ కుమార్ చౌదరి కన్న కలను నెరవేర్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, ధోనీ ఫినిషింగ్ స్టైల్‌ను చూస్తూ పెరిగానని, ఆయన స్ఫూర్తితోనే ఈ మ్యాచ్‌ను ముగించగలిగానని చెప్తూ ఈ విజయాన్ని ధోనీకి అంకితం చేశారు.

Mukul Choudhary: ఎవరీ ముకుల్ చౌదరి?

ముకుల్ చౌదరి రాజస్థాన్‌కు చెందినవాడు. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన అతడు దేశవాళీ క్రికెట్‌లో రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇటీవల అండర్-23 లెవెల్‌లో సత్తాచాటాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-2026లో ఐదు ఇన్నింగ్స్‌లలో సుమారు 200 స్ట్రైక్ రేటుతో 173 రన్స్ స్కోరు చేశాడు. జనవరి 2023లో రంజీ ట్రోఫీ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో డెబ్యూ చేశాడు.

గతేడాది డిసెంబర్‌లో లిస్ట్-ఏ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.డెత్ ఓవర్లలో పరుగులు చేస్తాడని ముకుల్‌కు పేరుంది. 160కి పైగా స్ట్రైక్ రేటుతో అతడు రన్స్ రాబడుతున్నాడు. ముకుల్ తన తండ్రి దిలీప్ కుమార్ చౌదరి ప్రోద్భలంతో క్రికెట్ వైపు అడుగులు వేశాడు. ముకుల్ పుట్టకముందే.. అతడిని క్రీడాకారుడిని చేయాలని దిలీప్ భావించాడట. తొలుత టీచర్‌గా పనిచేసిన దిలీప్, ఆ తర్వాత రియల్ ఎస్టేట్, హోటల్ వ్యాపారంలో రాణించాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

షాహీన్ అఫ్రిది పోస్ట్‌పై నెటిజన్ల ఫైర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha