Vangalapudi Anita: వైసిపి నాయకులకు కేవలం సమస్యలు సృష్టించడం, ప్రభుత్వంపై బురదజల్లడమే అలవాటుగా మారిందని, వారికి సమాధానాలు వినే ఓపిక కూడా లేదంటూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కూటమి ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షలపై ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ కేవలం నోటి మాటలతో తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని, ఆధారాలు లేకుండా బురదజల్లే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హోంమంత్రి గట్టిగా హెచ్చరించారు.

Read also: Nara Lokesh: విశాఖ-కాకినాడ తీరంలో కెమికల్ ప్లాంట్ ఏర్పాటు.. రష్యా దిగ్గజానికి లోకేష్ ఆహ్వానం
టీచర్లను మద్యం షాపుల ముందు నిలబెట్టింది ఎవరు? వైసిపిపై వంగలపూడి అనిత ఆగ్రహం
గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను తీసుకెళ్లి మద్యం దుకాణాల ముందు నిలబెట్టిన ఘనత వారిదేనని వంగలపూడి అనిత ఆక్షేపించారు. గతంలో వారు గ్రూప్-1 పరీక్షలను ఎంత అధ్వానంగా నిర్వహించారో ప్రజలందరూ చూశారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులలో అత్యధిక శాతం మంది గతంలో టీడీపీ హయాంలోనే నియమితులయ్యారని, గతంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించి తాము ఎంతో గౌరవప్రదంగా నియామక పత్రాలను అందించామని స్పష్టం చేశారు.
Vangalapudi Anita: బ్రిడ్జ్ స్పోర్ట్స్ అంటే జూదం క్లబ్‌లు కావు: వైసిపికి అనిత చురకలు
‘బ్రిడ్జ్ స్పోర్ట్స్’ అంశంపై కనీస అవగాహన లేకుండా వైసిపి నేతలు మాట్లాడుతున్నారని అనిత ఎద్దేవా చేశారు. బ్రిడ్జ్ స్పోర్ట్స్ అంటే గొడ్డలి పార్టీ నాయకులు గతంలో నడిపించిన జూదం క్లబ్‌లు కావని ఘాటుగా చురకలు అంటించారు. కేవలం తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమే వైసిపి నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com

