APSPDCL CMD Shivashankar: ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలో పరిశ్రమలకు విద్యుత్ సమస్యలను రానివ్వకూడదని ఆ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులు, సిబ్బందికి సూచించారు.
పారిశ్రామిక విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి బుధవారం వినియోగదారులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. సంస్థ పరిధిలోని 9 జిల్లాల పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ సమస్యల పరిష్కారానికై ప్రతినెలా మొదటి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏపీఎస్పీడీసీఎల్ అవకాశం కల్పిస్తోంది. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి జరిగిన ఈ కార్యక్రమం ద్వారా సంస్థ పరిధిలోని తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి 10 మంది పారిశ్రామిక వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలపై చర్చిస్తూ, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయాలని కోరారు.
APSPDCL CMD Shivashankar: నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యం
ఈ సందర్భంగా సీఎండి శివశంకర్ లోతేటి మాట్లాడుతూ పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయడం ద్వారా పారిశ్రామిక రంగం అభివృద్ధికి ఏపీఎస్పీడీసీఎల్ కృషి చేస్తోందని తెలిపారు. పరిశ్రమలకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో సబ్-స్టేషన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. పారిశ్రామిక విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సంస్థ అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు.
పాల్గొన్న ఉన్నతాధికారులు
చిత్తూరు సమీపంలోని గండ్రాజుపల్లి పారిశ్రామికవాడ నుంచి అల్లూరయ్య మాట్లాడుతూ తమకు దగ్గరలో సబ్-స్టేషన్ లేకపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని తెలియజేయగా ఈ అంశంపై సీఎండి స్పందిస్తూ గండ్రాజుపల్లె పారిశ్రామికవాడకు ప్రత్యేకంగా సబ్-స్టేషన్ ను మంజూరు చేశామని, నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (టెక్నికల్ & హెచ్ఆర్ డి) కే. గురవయ్య, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ఐటి) పి. అయూబ్ ఖాన్, డైరెక్టర్/ఫైనాన్స్ (ఎఫ్ఎసి) కే. రామమోహన్ రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు యం. ఉమాపతి, ఎం. మురళి కుమార్, కే. సంపత్ కుమార్, ఎస్. రమణ, జనరల్ మేనేజర్లు చక్రపాణి, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

