Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా రష్యాలో పర్యటిస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తన పర్యటనలో మరో కీలక అడుగు వేశారు.
మాస్కో వేదికగా రష్యాకు చెందిన ప్రముఖ గ్యాస్, మిథనాల్ కెమికల్స్ దిగ్గజం 'రస్ కెమ్ గ్రూప్' (Ruschem Group) ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సీఈఓ ఇల్యా కోసిహ్, అంతర్జాతీయ వ్యాపార విభాగాధిపతి దర్యా అషానియాలు పాల్గొన్నారు. నవ్యాంధ్రలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరిస్తూ మంత్రి లోకేష్ పలు ఆకర్షణీయమైన ప్రతిపాదనలను వారి ముందుంచారు.

Read also: Chandrababu Naidu: పవన్ పై విమర్శలు ఆపండి.. తెలంగాణ నాయకులపై చంద్రబాబు ఫైర్!
విశాఖ-కాకినాడ తీరంలో మెగా కెమికల్ ప్లాంట్‌కు ప్రతిపాదన
భారతదేశం దిగుమతి చేసుకునే పెట్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్ అవసరాలను తీర్చేందుకు ఏపీ తూర్పు తీరం అత్యంత అనుకూలమైనదని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నం - కాకినాడ పీసీపీఐఆర్ (PCPIR) పరిధిలో రస్ కెమ్ ఆధ్వర్యంలో ఒక అత్యాధునిక ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన కోరారు. దాంతో పాటు పోర్టు ఆధారిత కెమికల్ లాజిస్టిక్స్ హబ్‌లు, బల్క్ కెమికల్ స్టోరేజీ వసతులు, ప్రత్యేక వాటర్ ఫ్రంట్ బెర్త్‌ల అభివృద్ధి వంటి మౌలిక వసతుల కల్పనలో భాగస్వాములు కావాలని రష్యా బృందాన్ని ఆహ్వానించారు.
Nara Lokesh: పరిశోధనా కేంద్రం (R&D), గ్రీన్ ఎనర్జీపై లోకేష్ ఫోకస్
పరిశ్రమల స్థాపనతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలకు ఏపీ వేదిక కావాలని లోకేష్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ప్రతిభావంతమైన మానవ వనరులను ఉపయోగించుకుని, సరికొత్త కొలాబరేటివ్ పాలిమర్ అప్లికేషన్, మెటీరియల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ (R&D Center) ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని, రస్ కెమ్ అధునాతన సాంకేతికతతో పునరుత్పాదక ఇంధన కారిడార్లను అనుసంధానిస్తూ, తక్కువ కర్బన ఉద్గారాలను (Low Carbon Emissions) విడుదల చేసే రసాయనాల తయారీ యూనిట్‌ను స్థాపించాలని కోరారు.
మంత్రి ప్రతిపాదనలపై రస్ కెమ్ గ్రూప్ సానుకూల స్పందన
మంత్రి నారా లోకేష్ చేసిన ప్రతిపాదనల పట్ల రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సీఈఓ ఇల్యా కోసిహ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము ప్రత్యేక ఎస్‌పీవీల (SPV) ద్వారా భారతదేశ హోల్‌సేల్ కెమికల్ పంపిణీ మార్కెట్లోకి అడుగుపెడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ముంబై, కాన్పూర్ కేంద్రాలుగా స్థానిక పరిశ్రమలకు అవసరమైన రసాయనాలను సరఫరా చేస్తున్నామని, స్థానిక సంస్థలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ సరఫరా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా విశాఖ, కాకినాడలోని ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు అవసరమైన కీలక రసాయనాలను అందిస్తామని ఆయన పేర్కొన్నారు. మంత్రి లోకేష్ అందించిన ప్రతిపాదనలు ఎంతో ఆశాజనకంగా ఉన్నాయని, వీటిపై తమ సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి త్వరలోనే తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఇల్యా కోసిహ్ స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also:
తెలంగాణకు కొత్త కళ.. రూ.1200 కోట్లతో తెరణ్యం బయోలాజిక్స్ ప్రారంభం

