AP Mega DSC: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మెగా డీఎస్సీ-2025' ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను పాఠశాల విద్యాశాఖ, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తోసిపుచ్చాయి.
టీచర్ పోస్టుల భర్తీ అంతా పూర్తిగా అభ్యర్థుల మెరిట్ ఆధారంగా, ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ రోస్టర్ రూల్స్ ప్రకారమే అత్యంత పారదర్శకంగా సాగిందని స్పష్టం చేశాయి. ఈ నియామకాల్లో ఎలాంటి అక్రమాలకు తావులేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
Kona Sasidhar On AP DSC Results
అంతా ఆన్‌లైన్.. కంప్యూటర్ ఆధారిత పరీక్షతోనే నియామకాలు!
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో ఎంతో నిష్పాక్షికంగా ఎగ్జామ్స్ నిర్వహించినట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అభ్యర్థుల మెరిట్ లిస్టులు, ఫైనల్ సెలక్షన్ లిస్టులతో పాటు అన్ని రకాల వివరాలను నిబంధనల ప్రకారం అధికారిక వెబ్‌సైట్లోనే అందుబాటులో ఉంచామన్నారు. ప్రభుత్వ జీవోలు, రిజర్వేషన్ పద్ధతులను పక్కాగా పాటిస్తూ, బహుళస్థాయి స్క్రూటినీ (పరిశీలన) పూర్తయిన తర్వాతే అపాయింట్‌మెంట్స్ ఇచ్చామని.. కాబట్టి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని పేర్కొన్నారు.
Read also: AP Weather Updates: రాబోయే 48 గంటల్లో ఏపీని తాకనున్న నైరుతి రుతుపవనాలు
AP Mega DSC: సీబీఐ విచారణ కోరిన ప్రతిపక్ష వైఎస్సార్సీపీ
ఈ నియామక ప్రక్రియలో ప్రశ్నపత్రాల లీకేజీ, డేటా ట్యాంపరింగ్, మెరిట్ జాబితాల విడుదలలో జాప్యంతో పాటు స్పోర్ట్స్ కోటా, ఇతర రిజర్వేషన్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ప్రతిపక్ష వైసీపీ ఆరోపించింది. అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ, ఈ మెగా డీఎస్సీ ప్రక్రియపై వెంటనే సీబీఐ (CBI) దర్యాప్తు జరిపించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
అనుమానాలుంటే కమిషనరేట్‌కు రావచ్చు: అధికారుల వెల్లడి
ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) స్పెషల్ సీఎస్ రావత్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, శాప్ ఎండీ భరణి సచివాలయంలో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. డీఎస్సీ నియామకాలపై ఎవరికైనా ఎలాంటి సందేహాలున్నా నేరుగా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు వచ్చి నివృత్తి చేసుకోవచ్చని వారు సూచించారు. తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న 34 మంది అభ్యర్థుల ర్యాంకులు, స్పోర్ట్స్ మెరిట్, హారిజాంటల్ రిజర్వేషన్ వివరాలను ఆధారాలతో సహా ప్రదర్శించి, నిబంధనల ప్రకారం వారికి ఉద్యోగాలు ఎందుకు రాలేదనే విషయాన్ని అధికారులు క్లియర్ చేయడంతో వివాదానికి తెరపడినట్లయింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

