Vegetable prices drop:దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ, తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూరగాయల ధరలు భారీ ఉపశమనాన్ని ఇస్తున్నాయి. గత కొంతకాలంగా చుక్కలు చూపించిన నిత్యావసర కూరగాయల ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
దీంతో మధ్యతరగతి, సామాన్యుల కుటుంబాల నెలవారీ గృహ బడ్జెట్‌పై ఎంతో సానుకూల ప్రభావం పడుతోంది. నవంబర్ 1వ తేదీ నాటి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల రైతు బజార్లలోని కూరగాయల తాజా ధరల వివరాలు మీకోసం…
PIB: త్వరలో రూ.1,000 నోటు రాబోతోందా? కేంద్రం కీలక క్లారిటీ
Vegetable prices have dropped significantly in the Telugu states.
హైదరాబాద్ రైతు బజార్లలో కూరగాయల ధరలు
నవంబర్ 1న కూకట్‌పల్లి మోడ్రన్ అండ్ మోడల్ రైతుబజార్‌లో నమోదైన వివిధ కూరగాయల రిటైల్ ధరలు కిలో చొప్పున ఇలా ఉన్నాయి
- టమాటా: రూ. 27
- ఉల్లిపాయలు (ఎండు): రూ. 40
- వంకాయ: రూ. 18
- బెండకాయ: రూ. 45
- పచ్చిమిర్చి: రూ. 48
- ఆలుగడ్డ (బంగాళదుంప): రూ. 24
- క్యాబేజీ: రూ. 13
- క్యారెట్: రూ. 40
- బీరకాయ / కాకరకాయ: రూ. 35
- దొండకాయ: రూ. 25
- సొరకాయ: రూ. 20
- పొట్లకాయ: రూ. 22
- బీట్‌రూట్: రూ. 23
- క్యాప్సికం: రూ. 50
- చిక్కుడుకాయలు: రూ. 60
- కాలీఫ్లవర్: రూ. 30
- అల్లం (కొత్త): రూ. 120 (పాత అల్లం: రూ. 180)
- వెల్లుల్లి: రూ. 260
- నిమ్మకాయలు: డజను రూ. 50 – రూ. 60
Vegetable prices drop:విజయవాడ రైతు బజార్లలో నేటి ధరలు
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పరిధిలోని రైతు బజార్లలో కూరగాయల ధరలు కూడా చాలా వరకు అదుపులోకి వచ్చాయి. ప్రధాన కూరగాయల ధరలు కిలోకు ఈ క్రింది విధంగా ఉన్నాయి
- టమాటా: రూ. 40
- ఉల్లిపాయలు: రూ. 39
- వంకాయ: రూ. 22
- బెండకాయ: రూ. 24
- పచ్చిమిర్చి: రూ. 40
- బంగాళదుంప: రూ. 26
- కాకరకాయ: రూ. 34
- క్యాబేజీ: రూ. 25
- క్యారెట్: రూ. 48
- దొండకాయ: రూ. 26
- బీరకాయ: రూ. 36
- సొరకాయ: రూ. 15
- బీట్‌రూట్: రూ. 38
- బీన్స్: రూ. 100
- క్యాప్సికం: రూ. 66
- కొత్తిమీర: రూ. 20
సామాన్యులకు పెద్ద ఉపశమనం
వంటగదిలో అత్యంత కీలకమైన టమాటా, ఉల్లిపాయల ధరలు గతంలో రికార్డు స్థాయిలో పెరిగి వినియోగదారులను బెంబేలెత్తించాయి. అయితే ఇప్పుడు టమాటా ధర రూ. 27 నుండి రూ. 40 మధ్యకు పడిపోవడం, ఉల్లి ధరలు కూడా రూ. 40 లోపే లభిస్తుండటంతో వంటగది నిర్వహణ కాస్త సులువవుతోంది. పండుగ వేళ ఈ ధరల పతనం ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది.
Epaper: epaper.vaartha.com

