Dailyhunt
జీడీపీ నుండి ఉత్పాదకత వైపు దృష్టి.. సుమన్ బెరీ

జీడీపీ నుండి ఉత్పాదకత వైపు దృష్టి.. సుమన్ బెరీ

వార్త 1 week ago

GDP to Productivity: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ హైదరాబాద్ సమ్మిళిత, సరళేతర, ఉత్పాదకత ఆధారిత వృద్ధికి చోదకంగా దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయాణంలో తదుపరి దశను నిర్దేశించే వ్యూహాత్మక రోడ్మ్యప్ను నీతి ఆయోగ్ ప్రారంభించింది.

నీతి ఆయోగ్ సీఈఓ నిధి చిబ్బర్ సమక్షంలో వైస్ చైర్మన్ సుమన్ బెరీ ఈ రోడ్మ్యప్ను ఆవిష్కరించారు. ఈ రోడ్మ్యప్ దేశ డిజిటల్ పరివర్తన కోసం రెండు దశల మార్గాన్ని నిర్దేశిస్తోంది. పెద్ద ఎత్తున జీవనోపాధి ఆధారిత వృద్ధిని సాధించడానికి డిజి టల్ పబ్లిక్ ఇన్స్ స్ట్రక్చర్ (డీపీఐ) 2025-2035, ఆ తర్వాత విసృత ఆధారిత శ్రేయస్సును సాధించడానికి 2035-2047 వరకూ అమలు చేయనుంది.

Read Also: Saraswathi Anthya Pushkaralu: మే 21 నుండి సరస్వతీ అంత్య పుష్కరాలు

 NITI Aayog releases new roadmap.

ఉత్పాదకత, జీవన ప్రమాణాలు

ఈ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ మాట్లాడుతూ, దృష్టి జీడీపీ నుండి ఉత్పాదకత వైపు మళ్లిందన్నారు. అధిక నాణ్యత గల ఉపాధి, బలమైన ఆదాయాలు, మెరుగైన జీవన ప్రమాణాలు పెరుగుతున్న ఉత్పాదకతపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. దేశం ఈ స్థాయికి చేరుకోవడానికి నెట్వర్క్లను సద్వినియోగం చేసుకోవడమే అని ఈ రోడ్మ్యాప్ ఆ మార్పును స్పష్టం చేస్తుందన్నారు.

వికసిత్ భారత్ 2047 దిశగా అడుగులు

దేశ అభివృద్ధి ప్రయాణంలో ఆర్టిఫిషియల్, ఇంటెలిజెంట్ డిపిఐ లను కేంద్ర స్థానంలో నిలిపి, వికసిత్ భారత్ 2047కు పునాది వేయడంలో సహాయపడటం ద్వారా, అభివృద్ధి యొక్క తదుపరి దశ రూపుదిద్దుకుంటుందని వివరించారు. దేశం తన డిజిటల్ రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందితే, దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాష్ట్రాల సమ్మిళిత వృద్ధిని వేగవంతం చేయడంలో డిపిఐ ఒక ముఖ్యమైన సాధనంగా మారగలదని స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతికతలను పటిష్టమైన శాస్త్రీయ పద్ధతులు మరియు రక్షణలతో అనుసంధానించాలన్నారు. పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే శక్తివంతమైన నిర్మాణాత్మక ప్రయోజ నంతో ఈ తదుపరి దశలోకి ప్రవేశిస్తోందని వెల్లడించారు.

ప్రముఖుల భాగస్వామ్యం

డీపీఐ, ఏఐ, వ్యవస్థాపకతను కలపడం ద్వారా, భారతదేశం జీవితాలను మెరుగుపరిచే, జీవనోపాధిని బలోపేతం, కీలక రంగాలలో ఉత్పాదకతను పెంచే సమ్మిళిత, స్థానిక, జనాభా స్థాయి ఏఐ స్వీకరణ నమూనాను నిర్మించగలదని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ వి. అనంత నాగేశ్వరన్, నీతి ఆయోగ్ విశిష్ట ఫెలో శ్రీమతి దేబ్జానీ ఘోష్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సూపర్వైజర్ల అసభ్య ప్రవర్తన.. తక్షణమే తొలగించాలని సీపీఎం డిమాండ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha