Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శివంపేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం - SSC ఫలితాల్లో 100% ఉత్తీర్ణత

శివంపేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం - SSC ఫలితాల్లో 100% ఉత్తీర్ణత

వార్త 1 month ago

Telangana: సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల పరిధిలోని శివంపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎస్ఎస్సి 2025-26 ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు.

ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కలిపి మొత్తం 72 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై, అందరూ ఉత్తీర్ణత సాధించి 100% ఫలితాన్ని నమోదు చేశారు.

Read Also: Komatireddy Raj Gopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి.. తల్లి ఎలా అవుతుంది?.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

 Telangana: Shivampet school students celebrate success - 100% pass rate in SSC results

పాఠశాలలో పి. గాయత్రి 538 మార్కులతో మొదటి స్థానం సాధించగా, కె. నితిన్ 537 మార్కులతో రెండవ స్థానం, ఇ. రచిత 534 మార్కులతో మూడవ స్థానం పొందారు. అదనంగా, 12 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి విశేష ప్రతిభ చూపారు.

ఈ విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేదశ్రీ గారు, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు. అలాగే 100% ఉత్తీర్ణత సాధించినందుకు గాను విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను తల్లిదండ్రులు, సర్పంచ్, ఉప సర్పంచ్ గ్రామ పెద్దలు ప్రత్యేకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ: అధికారులకు స్థల పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha