RBI's new 2FA rules: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) దేశంలో పెరుగుతున్న డిజిటల్ లావాదేవీల భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
పెరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు ఏప్రిల్ 1 నుండి సరికొత్త నిబంధనలను అమలులోకి తీసుకురానుంది. ఈ నూతన విధానం ప్రకారం అన్ని రకాల ఆన్‌లైన్ చెల్లింపులకు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) విధానాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల వినియోగదారులు జరిపే ప్రతి లావాదేవీకి రెండు స్థాయిల ధృవీకరణ అవసరమవుతుంది.
Read Also: Salaries of Workers : ఉద్యోగుల కంటే కార్మికుల జీతాలే భారీగా పెరుగుతున్నాయట
నూతన ధృవీకరణ విధానం
ప్రస్తుతం అమలులో ఉన్న విధానం ప్రకారం చాలా వరకు డిజిటల్ లావాదేవీలు కేవలం మొబైల్‌కు వచ్చే వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) ద్వారా పూర్తవుతున్నాయి. అయితే ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చే నిబంధనల ప్రకారం వినియోగదారులు లావాదేవీని విజయవంతంగా పూర్తి చేయడానికి ఓటీపీతో పాటు మరొక అదనపు భద్రతా పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వ్యక్తిగత పిన్ (PIN), పాస్‌వర్డ్ లేదా వేలిముద్రలు మరియు ఫేస్ ఐడి వంటి బయోమెట్రిక్ విధానాలలో ఏదో ఒకదానిని రెండవ ధృవీకరణ పద్ధతిగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ రెండు స్థాయిల గుర్తింపు ప్రక్రియ పూర్తయితేనే బ్యాంక్ ఖాతా నుండి నగదు బదిలీ జరుగుతుంది.
RBI announcement of new digital payment rules with 2FA security features
RBI’s new 2FA rules: సైబర్ మోసాలకు కళ్లెం
ఈ కఠినతరమైన భద్రతా చర్యల వల్ల ఆన్‌లైన్ మోసగాళ్లకు చెక్ పెట్టవచ్చని ఆర్బీఐ భావిస్తోంది. సాధారణంగా సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాల్లో వినియోగదారుల పాస్‌వర్డ్ లేదా ఓటీపీని దొంగిలించి ఖాతాల నుండి నగదును మళ్లించేవారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం నేరగాళ్లకు ఓటీపీ తెలిసినప్పటికీ, వినియోగదారుడి పిన్ లేదా బయోమెట్రిక్ వివరాలు లేనిదే లావాదేవీని పూర్తి చేయడం సాధ్యపడదు. దీనివల్ల సామాన్య ప్రజల సొమ్ముకు డిజిటల్ ప్రపంచంలో మెరుగైన రక్షణ లభిస్తుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :
"వెల్కమ్ టు హెల్".. అమెరికా సైన్యానికి ఇరాన్ పత్రిక భయంకరమైన వెల్కమ్

