Dimagi Naxal Janta Party X Account : స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 'దిమాగీ నక్సల్' (అర్బన్/ఆలోచనా నక్సల్స్) వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి.
దేశంలో సాయుధ నక్సలిజం తగ్గినప్పటికీ, వ్యవస్థలలో భావజాలపరంగా ప్రభావం చూపే ‘దిమాగీ నక్సల్స్’ ఇంకా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్‌కు ప్రతిస్పందనగా సోషల్ మీడియా వేదికలపై భిన్నమైన వ్యంగ్య నిరసనలు వెల్లువెత్తాయి.
Read Also: Rahul Letter : ఝార్ఖండ్ సీఎంకు రాహుల్ లేఖ
Dimagi Naxal Janta Party X Account
‘దిమాగీ నక్సల్ జనతా పార్టీ’ ఖాతా వెలుగులోకి
ప్రధాని వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందిస్తూ ఎక్స్ (ట్విట్టర్) మరియు ఇన్స్టాగ్రామ్‌లలో @DNJP_India (దిమాగీ నక్సల్ జనతా పార్టీ) పేరుతో కొత్త సటైరికల్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. తాము భగత్ సింగ్ అనుచరులమని, తమపై దేశద్రోహం ముద్ర వేస్తే భగత్ సింగ్‌ను అవమానించినట్లేనంటూ ఆ అకౌంట్ పోస్ట్ చేసింది. తమకు పిఎం కేర్స్ ఫండ్ నుంచే నిధులు వస్తున్నాయని, సమాచారం కావాలంటే ఆ ఫండ్‌పై ఆడిట్ కోరవచ్చంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరింది.
ప్రారంభించిన ఒక్క రోజులోనే ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతా లక్షకు పైగా ఫాలోవర్లను సంపాదించుకోవడం గమనార్హం.
Dimagi Naxal Janta Party X Account : రాజకీయ ప్రముఖులు మరియు నెటిజన్ల రియాక్షన్
ఈ ఖాతా రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, ధ్రువ్ రాఠీ, కునాల్ కమ్రా మరియు ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులను ఫాలో అవుతోంది. నటుడు ప్రకాష్ రాజ్ చేసిన “తెలివిగా ఉండండి, మూర్ఖులుగా కాదు… ప్రశ్నించండి, బానిసలుగా మారకండి” అనే పోస్ట్‌ను కూడా ఈ పేజీ రీట్వీట్ చేసింది. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం స్పందిస్తూ తాను ‘దిమాగీ నక్సల్’ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడటంతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టత ఇచ్చారు. ప్రధాని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, రాజ్యాంగాన్ని తిరస్కరించే వారు, వేర్పాటువాదులు మరియు దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే వారిని ఉద్దేశించే ఆ పదాన్ని ఉపయోగించారని స్పష్టం చేశారు.

