DeMart's entry into the pharmacy business : కిరాణా విభాగంలో దూసుకుపోతున్న డిమార్ట్ ఇప్పుడు సరికొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది. రాధాకిషన్ దమానీ నేతృత్వంలోని అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డీమార్ట్) కిరాణా, నిత్యావసరాల విభాగంలో సాధించిన అపూర్వ విజయంతో ఇప్పుడు భారత రిటైల్ ఫార్మసీ రంగంలోకి అడుగుపెట్టింది.
నిత్యావసర ఉత్పత్తుల విక్రయంలో డీమార్ట్ అనుసరిస్తున్న విశ్వసనీయమైన ఎవ్రీడే లో ప్రైసింగ్ (EDLP) వ్యూహాన్నే ఫార్మసీ విభాగానికి కూడా వర్తింపజేస్తూ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) పరిధిలో ఔషధాలపై ఫ్లాట్ 20 శాతం డిస్కౌంట్ ఆఫర్‌తో పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దేశీయ ఫార్మసీ రంగంలో ముఖ్యంగా సాంప్రదాయ మెడికల్ షాపులు, డిజిటల్ ఈ-ఫార్మసీ ప్లాట్‌ఫామ్‌ల వ్యాపార నమూనాలను డిమార్ట్ తీవ్రంగా ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
Read Also: CJP Sourav Das: హృతిక్ రోషన్ లా ఉన్నావేమో అంటున్నారు.. కంగనాకు సీజేపీ నేత కౌంటర్
DeMart’s entry into the pharmacy business
DeMart’s entry into the pharmacy business : హైపర్‌మార్కెట్‌లలోనే ప్రత్యేక ఫార్మసీ కౌంటర్లను ఏర్పాటు
డీమార్ట్ ఈ ఫార్మసీ వ్యాపారాన్ని తన పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ అయిన రిఫ్లెక్ట్ హెల్త్‌కేర్ అండ్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ (RHRPL) ద్వారా హితేష్ షా సారథ్యంలో నడిపిస్తోంది. బ్రాండెడ్ జెనెరిక్ ఔషధాలపై స్థూల లాభాల మార్జిన్లు 25 నుండి 30 శాతం వరకు ఉంటాయి, ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తుల్లో ఇవి ఇంకా ఎక్కువగా నమోదవుతాయి. ఆర్థిక సంవత్సరం 2025లో ఈ సంస్థ సాధించిన వివరాలు పరిశీలిస్తే.. మునుపటి ఏడాదితో పోలిస్తే దాదాపు నాలుగు రెట్ల వృద్ధి నమోదు చేస్తూ ఆర్‌హెచ్‌ఆర్‌పిఎల్ రాబడి రూ. 12.92 కోట్లకు చేరింది. ఆరంభ విభాగాన్ని విస్తరించే క్రమంలో అయిన ప్రాథమిక పెట్టుబడుల వల్ల కంపెనీ నష్టాలు రూ. 0.69 కోట్ల నుండి రూ. 2.45 కోట్లకు పెరిగినప్పటికీ.. స్థిరమైన వృద్ధి వైపు ఇది సానుకూల ధోరణినే సూచిస్తోందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com

