CJP Sourav Das: ప్రముఖ నటి, ఎంపీ కంగనా రనౌత్ చేసిన 'పనికిమాలినవాడు', 'నిరుద్యోగి' అనే తీవ్రమైన వ్యాఖ్యలపై 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తనదైన శైలిలో స్పందించారు.
కంగనా తనపై కంగనా వ్యక్తిగత విమర్శలకు దిగడానికి కారణం, తాను “యువ హృతిక్ రోషన్‌లా కనిపించడమే” కావొచ్చని తన స్నేహితులు అంటున్నారని ఆయన చమత్కరించారు. ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖా దత్‌తో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గత కొన్ని రోజులుగా కంగనా తనను లక్ష్యంగా చేసుకోవడంపై సౌరవ్ దాస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “నా స్నేహితులు నాకు టెక్స్ట్ చేసి ‘ఆమె నీ వెనుక ఎందుకు పడింది?’ అని అడుగుతున్నారు. వారిలో ఒకరు ‘నువ్వు బహుశా యువ హృతిక్ రోషన్‌లా కనిపిస్తున్నావేమో’ అని అన్నారు. నా లాంటి వ్యక్తిపై ఆమె ఎందుకు దాడి చేయాలనుకుంటుందో అర్థం కాలేదు” అని నవ్వుతూ చెప్పారు. అయితే, కంగనాపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదా ద్వేషం లేవని ఆయన స్పష్టం చేశారు.
Read Also : Gen-Z Reels : కంగన పై సోనూసూద్ ఫైర్
“People say you look like Hrithik Roshan…” - CJP leader’s counter to Kangana.
అభిప్రాయ భేదాలను వ్యక్తిగత దాడులతో కాకుండా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సౌరవ్ దాస్ సూచించారు. కంగనా రనౌత్‌పై నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. తనే జెన్-జీ పైనా, ఇప్పుడు నాపైనా వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను ఇప్పటికే నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చెప్పాను.. ‘యో కంగనా, కాస్త శాంతించు. దీని గురించి మనం మాట్లాడుకుందాం’ అని. మన దేశంలో ఉన్న ప్రధాన సమస్యే ఇది, ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. అభిప్రాయాలు వేరైనా ఒకరినొకరు గౌరవించుకుంటూ సంభాషణలు జరపాలి అని ఆయన అన్నారు.
CJP Sourav Das: ఆమె నన్ను కాదు.. దేశ యువతను కించపరుస్తున్నారు!
ప్రజాప్రతినిధులు దేశ యువత గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, తాము ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. కంగనా చేసిన “పనికిమాలినవాడు, నిరుద్యోగి” అన్న వ్యాఖ్యలను తాను వ్యక్తిగతంగా తీసుకోలేదన్న సౌరవ్ దాస్.. “ఆమె నన్ను కాదు, దేశ భవిష్యత్ తరమైన యువతను కించపరుస్తున్నారు. నాకు ఉద్యోగం ఉంది, గూగుల్ ఆమెకు తప్పుడు సమాచారం ఇస్తోంది” అని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ కంగనాతో మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఆమె నేరుగా ఫోన్ చేయవచ్చని స్పష్టం చేశారు.

