Dailyhunt
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

వార్త 5 days ago

న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలి: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్‌

Telangana Employees JAC: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ రోజు తెలంగాణ ఎంప్లాయిస్ టీచర్స్ & పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) పిలుపులో భాగంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల తహసీల్దార్ గారికి వినతిపత్రం అందించడం జరిగిందని జేఏసీ ప్రతినిధులు తెలిపారు.

ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారమే లక్ష్యంగా టీజీఈజేఏసీ ప్రకటించిన కార్యచరణలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో పుల్కల్ మండల తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించిన అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని కోరారు.

Read also: Sadashivpet: సదాశివపేట ఎంపీడీవో కార్యాలయంలో అస్తవ్యస్త పాలన

Telangana Employees JAC Protest 2026

Telangana Employees JAC: ప్రభుత్వ దృష్టికి పెండింగ్ సమస్యలు

టీజీఈ జేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళిన అనేక సమస్యలలో కొన్ని సమస్యలు పరిష్కారమైనప్పటికీ ఇంకా అనేక సమస్యలు, నేటికి పెండింగ్‌లోనే ఉన్నాయని అవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని వివిధ రూపాలలలో సీఎస్‌, ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, న్యాయబద్ధమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని వారు కోరారు. జూన్ 2వ తేదీ నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలని తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ మండల ప్రతినిధులు అన్నారు.

ప్రధాన డిమాండ్లు, కార్యాచరణ

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. 2026 జూన్ 2వ తేదీ నాటికి పీఆర్పీ అమలుతో పాటు పెండింగులో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలని, అలాగే రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ జారీ చేసి తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానంను పునరుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నోటిఫికేషన్ వేసి తర్వాత నియామకమైన ఉద్యోగులకు వెంటనే ఓపీఎస్ విధానమును అమలు చేయాలని కోరారు.

Telangana Employees JAC Protest 2026

ఇతర ఉద్యోగ సమస్యల పరిష్కారం

గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసుల ఉద్యోగ నియామక సమస్యను సత్వరం పరిష్కరించాలని కోరారు. అలాగే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. త్వరలో జనాభా లెక్కల కార్యక్రమం ఉన్నందున ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారు

ఈ కార్యక్రమంలో బి. లక్ష్మీనారాయణ PRTU TS పుల్కల్ మండల అధ్యక్షులు, బి.రామక్రిష్ణ TPUS పుల్కల్ మండల అధ్యక్షులు, G. ప్రహ్లాద్, PRTU TS ప్రధాన కార్యదర్శి, ఎం నవీన్ TPUS పుల్కల్ మండల ప్రధాన కార్యదర్శి, కె. శ్రీనివాసాచారి, ఎ బాలరాజ్, కె స్వప్న, నర్సిములు, రఘునాథ్ రెడ్డి, అనిల్ ఇతర ఉపాధ్యాయులు మరియు ఇతర డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఎస్సార్ మ్యాపింగ్‌పై బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha