Dailyhunt
ఎస్సార్ మ్యాపింగ్‌పై బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం

ఎస్సార్ మ్యాపింగ్‌పై బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం

వార్త 5 days ago

Sangareddy RTA and Revenue: సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండల కేంద్రంలో శుక్రవారం తాసిల్దార్ కార్యాలయంలో బిఎల్ఓలకు ఎస్సార్ మ్యాపింగ్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఎస్సార్‌కు మ్యాచింగ్ అయిన వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కొడుకు, కూతురు, మనవడు, మనవరాలు తదితర కుటుంబ సభ్యుల వివరాలను మ్యాపింగ్‌లో నమోదు చేయాలని శిక్షణలో సూచించారు. శిక్షకులు గోపికృష్ణ కార్యక్రమాన్ని ప్రారంభించి బిఎల్ఓలకు విధివిధానాలపై అవగాహన కల్పించారు. మ్యాపింగ్ ప్రక్రియను ఖచ్చితంగా నిర్వహించాలని, ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read Also:Sadashivpet: సదాశివపేట ఎంపీడీవో కార్యాలయంలో అస్తవ్యస్త పాలన

Sangareddy RTA and Revenue: ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ అనుదీప్, ఆర్‌ఐ ప్రమోద్ కుమార్, జీపీఓ సత్యనారాయణతో పాటు మండలంలోని బిఎల్ఓలు పాల్గొన్నారు. అధికారులు శిక్షణలో పాల్గొన్న వారికి సందేహాలను నివృత్తి చేస్తూ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మీ సేవ కేంద్రంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha