Medak Adarsh Bank Fraud: కంచె చేను మేసింది అన్న చందంగా తాను పని చేస్తున్న బ్యాంకుని మోసం చేసి దాదాపు కొట్టి 80 లక్షలు కాజేసిన సంఘటన జిల్లా కేంద్రం అయిన మెదక్ పట్టణాలలోని ఆదర్శ్ బ్యాంకు లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఆదర్శ్ బ్యాంకు లో మేనేజర్ గా పనిచేస్తున్న అనిల్ అతని భార్య స్నేహితులతో కలసి బ్యాంకు లో నకిలీ బంగారం పెట్టి పెద్ద మొత్తంలో లోన్ లు నగదు రూపంలో తీసుకుని బ్యాంకు ను మోసం చేయడం లో ప్రధాన పాత్ర పోషించినట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. బ్యాంకు సీఈఓ వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
Read Also:Devarkadra Tahsildar Issue: తహసీల్దార్ వచ్చినా.. రిజిస్ట్రేషన్లు మాత్రం ఇంచార్జీవే!
Medak Adarsh Bank Fraud: ఆన్‌లైన్ బెట్టింగ్‌ల కోసం
ఈ కేసులో దాదాపు 179.54 లక్షల మోసం కేసులు ముగ్గురు నిందితులు అరెస్టుబ్యాంకు సీఈఓ వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు మెదక్ యాదం అనిల్.. ఆన్ లైన్ బెట్టింగ్ అలవాటు పడి బ్యాంకు ను మోసం చేసిన మేనేజర్,యాదమ్మ అనిల్ ఆదర్శ కోపరేటివ్ అర్బన్ బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తు అతని భార్య స్నేహితులు ఇతరుల ఆధారు పాన్ కార్డులు తీసుకొని నకిలీ బంగారం పెట్టి పెద్ద మొత్తంలో లోన్లు తీసుకున్నాడు.సుమారు 31.35 లక్షల నగదు మోసపూరితంగా తీసుకొని బ్యాంకును మోసం చేశారన్నారు. రెండవ నిందితుడు శ్రీనివాసచారి నకిలీ బంగారంను ఒరిజినల్ అని చెప్పి బ్యాంకును మోసం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడని మూడవ నిందితుడు సుబ్రహ్మణ్యం, అనిల్ కు స్నేహితుడు.
సుబ్రహ్మణ్యం అతని భార్య నకిలీ బంగారం పెట్టి లోన్లు తీసుకొని వాడుకున్నామన్నారు. నాలుగవ నిందితురాలు అనిల్ భార్య స్రవంతి.. నకిలీ బంగారం పెట్టి లోన్ లు తీసుకున్నట్లు తెలిపారు. అనిల్ గతంలో ఆంధ్రప్రదేశ్ వాలేరుపాడు లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు లో కూడా మోసం చేయడంతో పాటు పోలవరం నిర్వాసితులు గిరిజనులను మోసం చేసి 11,82,487లక్షల డబ్బును వాడుకొని జైలుకు వెళ్లినట్లు తెలిపారు.నలుగురు నిందితులు కామారెడ్డి జిల్లాకు చెందిన వారుగా గుర్తించామన్నారు. ప్రధాన నిందితుడు అనిల్ ఉండగా మిగతా ముగ్గురిని రిమాండ్ కు పంపనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణం సీఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

