Dailyhunt
ఏబీ డివిలియర్స్ అరుదైన రికార్డును సమం చేసిన అయ్యర్

ఏబీ డివిలియర్స్ అరుదైన రికార్డును సమం చేసిన అయ్యర్

వార్త 1 week ago

Shreyas Iyer: సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అమోఘమైన ఇన్నింగ్స్ ఆడాడు.

క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే ఎటాకింగ్ గేమ్ మొదలుపెట్టిన అయ్యర్, ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 కళ్లు చెదిరే సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లక్ష్యం ఎంత పెద్దదైనా, తన పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో దానిని చిన్నదిగా మార్చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో హైదరాబాద్ జట్టుపై తనకున్న పట్టును శ్రేయస్ మరోసారి నిరూపించుకున్నాడు.

Read Also: Tirupati: మంత్రి లోకేశ్ చేతుల మీదుగా తిరుపతిలో క్రికెట్ స్టేడియం ప్రారంభం

 Shreyas Iyer record vs Sunrisers Hyderabad

Shreyas Iyer: ఏబీ డివిలియర్స్, శుభ్‌మన్ గిల్ రికార్డు సమం

ఈ అద్భుత అర్ధశతకంతో శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్‌లో ఒక ప్రత్యేక మైలురాయిని చేరుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అత్యధిక అర్ధశతకాలు బాదిన ఆటగాళ్ల జాబితాలో శ్రేయస్ ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఇది అతనికి హైదరాబాద్‌పై 5వ ఫిఫ్టీ. తద్వారా గతంలో ఐదు అర్ధశతకాలు సాధించిన లెజెండరీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్, స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ల రికార్డును అయ్యర్ సమం చేయడం విశేషం. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడమే కాకుండా రికార్డుల వేటలోనూ దూసుకుపోతున్నాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

చెపాక్‌లో 'పంజా' విసిరిన సీఎస్కే.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు తప్పని ఓటమి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha