Tirupati: తిరుపతి లో, ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో గోలవనిగుంటలో నిర్మించిన నూతన క్రికెట్ స్టేడియం ఈ నెల 15న (బుధవారం) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
ఈ నెల 15న మంత్రి నారా లోకేశ్ సాయంత్రం 4 గంటలకు స్టేడియాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీ-2025లో క్రీడా కోటా ద్వారా నియమితులైన అభ్యర్థులను కార్యక్రమానికి ఆహ్వానించినట్లు శాప్ అధికారులు తెలిపారు. క్రీడా అభివృద్ధికి తోడ్పడటం, భవిష్యత్ క్రీడాకారులను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Also:Andhra pradesh police : ఏపీలో నిందితులపై వరుస కాల్పులు
డిజిటల్ హంగులు
విశాఖపట్నం స్టేడియం తరహాలోనే ఇక్కడ భారీ ఎల్ఈడీ (LED) స్క్రీన్‌లు, అత్యాధునిక స్కోర్ బోర్డులను అమర్చారు.స్టేడియంలో నిర్మించిన పెవిలియన్ భవనం చివరి దశ పనుల్లో ఉంది. ఇందులో క్రికెటర్ల కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్‌లు, విశ్రాంతి గదులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్‌లను నిర్మించారు.
New Cricket Stadium Golavanigunta
Tirupati: వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీ
సాధారణ ప్రేక్షకులతో పాటు విభిన్న రంగాల ప్రముఖులు మ్యాచ్‌లను వీక్షించేందుకు వీలుగా స్టేడియం రెండో అంతస్తులో ప్రత్యేక వీఐపీ గ్యాలరీని ఏర్పాటు చేశారు. సుమారు 65 మందికి పైగా వీఐపీలు కూర్చుని సౌకర్యవంతంగా మ్యాచ్ చూసేలా దీన్ని తీర్చిదిద్దారు. స్టేడియం లోపలి గోడలపై ప్రముఖ క్రికెట్ క్రీడాకారుల చిత్రపటాలను వేయిస్తూ క్రీడా వాతావరణాన్ని ఉట్టిపడేలా చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

