Ebola Virus : ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాల్లో ప్రస్తుతం ఎబోలా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. ముఖ్యంగా 'బుండిబుగ్యో' అనే కొత్త రకం ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
ఈ నేపథ్యంలో రష్యా శాస్త్రవేత్తలు కొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ కొత్త రకం వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలదని తెలిపారు.
వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది?
ఈ వ్యాక్సిన్ శరీరంలోకి వెళ్లిన తర్వాత రోగనిరోధక వ్యవస్థను చురుకుగా మారుస్తుంది. వైరస్‌ను గుర్తించి దానిపై పోరాడేందుకు అవసరమైన యాంటీబాడీలను శరీరం ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. దీంతో వైరస్ సోకిన వెంటనే శరీరం వేగంగా స్పందించి దాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. రష్యా వద్ద ఉన్న ఆధునిక వ్యాక్సిన్ టెక్నాలజీ సహాయంతో దీనిని రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
Read Also : Vanaparthi Crime: అప్పుల బాధతో భార్యాపిల్లలను చంపి.. ఆ పై తాను ఉరేసుకొని ఆత్మహత్య
వైరస్ వ్యాప్తి, లక్షణాలు
ఎబోలా వైరస్ మొదట గబ్బిలాల నుంచి ఇతర జంతువులకు, అక్కడి నుంచి మనుషులకు వ్యాపించినట్లు (Ebola Virus) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాపించదు. రోగి రక్తం, చెమట, లాలాజలం, వాంతులు వంటి శరీర ద్రవాలను తాకడం వల్ల సోకుతుంది. మొదట జ్వరం, నీరసం, కండరాల నొప్పులు కనిపిస్తాయి. తర్వాత వాంతులు, విరేచనాలు, రక్తస్రావం వంటి తీవ్రమైన లక్షణాలు బయటపడతాయి. నిపుణులు ప్రజలు పరిశుభ్రత పాటించాలని, అడవి జంతువుల మాంసానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

