Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎడ్‌టెక్ దిగ్గజానికి అంతర్జాతీయ షాక్.. వెంటనే లొంగిపోవాలంటూ కోర్టు ఆదేశం!

ఎడ్‌టెక్ దిగ్గజానికి అంతర్జాతీయ షాక్.. వెంటనే లొంగిపోవాలంటూ కోర్టు ఆదేశం!

వార్త 3 months ago

Byjus Founder Byju Raveendran: భారతీయ ఎడ్‌టెక్ దిగ్గజం 'బైజూస్' (Byju's) వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు సింగపూర్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది.

కంపెనీ మరియు వ్యక్తిగత ఆస్తుల వెల్లడి, బదిలీలకు సంబంధించి ఏప్రిల్ 2024 నుండి న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను ఆయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు రుజువు కావడంతో కోర్టు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. తీర్పు వెలువడిన వెంటనే రవీంద్రన్ సింగపూర్ అధికారుల ముందు లొంగిపోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Read Also :America Iran War : ఇరాన్‌పై అమెరికా భారీ దాడులు.. మళ్లీ యుద్ధ మేఘాలు

భారీ జరిమానా.. లీగల్ చిక్కుల్లో బైజూ రవీంద్రన్

 Byjus Founder Byju Raveendran Singapore Court Jail Sentence Asset Orders

న్యాయస్థానాన్ని ధిక్కరించినందుకు (Contempt of Court) గాను జైలు శిక్షతో పాటు.. 70,500 అమెరికన్ డాలర్ల (సుమారు రూ. 58 లక్షలకు పైగా) కోర్టు ఖర్చులను కూడా బాధితులకు లేదా కోర్టుకు చెల్లించాలని బైజూ రవీంద్రన్‌ను సింగపూర్ న్యాయస్థానం ఆదేశించింది. బైజూస్ అంతర్జాతీయ పెట్టుబడిదారులు మరియు రుణదాతలతో నడుస్తున్న తీవ్రమైన న్యాయ వివాదాల (Legal Disputes) నేపథ్యంలో ఈ తీర్పు రావడం గమనార్హం.

Byjus Founder Byju Raveendran: కష్టాల్లో బైజూస్ సామ్రాజ్యం

గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక సంక్షోభం, నిధుల కొరత, మరియు రుణాల చెల్లింపుల వైఫల్యంతో బైజూస్ సంస్థ సతమతమవుతోంది. భారతదేశంలో ఈడీ (ED) విచారణలు, ఎన్‌సిఎల్‌టి (NCLT) లో దివాలా ప్రక్రియల సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో.. ఇప్పుడు సింగపూర్ కోర్టు నేరుగా వ్యవస్థాపకుడికి జైలు శిక్ష విధించడం ఆ సంస్థ భవిష్యత్తును మరింత అగమ్యగోచరంగా మార్చింది. ఈ అంతర్జాతీయ కోర్టు తీర్పుపై బైజూస్ యాజమాన్యం నుండి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

రష్యా యువతకు పుతిన్ బంపర్ ఆఫర్.. కోటి అప్పులు రద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha