Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈడీ ఎదుట చెవిరెడ్డి కుటుంబం.. లిక్కర్ కేసులో కీలక విచారణ

ఈడీ ఎదుట చెవిరెడ్డి కుటుంబం.. లిక్కర్ కేసులో కీలక విచారణ

వార్త 3 months ago

AP Liquor Scam : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ వ్యవహారంలో తన దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై దృష్టి సారించిన అధికారులు పలువురికి నోటీసులు జారీ చేస్తున్నారు.

ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా విచారణకు పిలిచారు. నోటీసుల మేరకు చెవిరెడ్డి భార్యతో పాటు ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈరోజు ఈడీ కార్యాలయానికి వెళ్లి అధికారుల ఎదుట హాజరయ్యారు. అధికారులు పలు ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాలపై ప్రశ్నించినట్లు సమాచారం.

ఆస్తుల వివరాలు అందించామని వెల్లడి

విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన మోహిత్ రెడ్డి, ఈడీ కోరిన అన్ని పత్రాలను సమర్పించినట్లు తెలిపారు. తమ కుటుంబానికి సంబంధించిన ఆస్తుల వివరాలను పూర్తిగా అధికారులకు అందించామని చెప్పారు. దర్యాప్తుకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని స్పష్టం చేశారు. తమ కుటుంబం సంపాదించిన ప్రతి రూపాయి కష్టపడి సంపాదించిందేనని, అక్రమ సంపాదన ఆరోపణల్లో నిజం లేదని పేర్కొన్నారు. తమపై వచ్చిన ఆరోపణలను చట్టపరంగానే ఎదుర్కొంటామని తెలిపారు.

Read Also : ఎంఎస్ఎంఈలకు గ్లోబల్ మార్కెట్.. మెటా, అమెజాన్‌తో ఏపీ ఒప్పందాలు

 AP Liquor Scam

కక్షసాధింపుతో కేసులంటూ ఆరోపణ

ఈ వ్యవహారంలో నమోదు చేసిన కేసులు రాజకీయ కక్షసాధింపులో భాగమని మోహిత్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం ఉద్దేశపూర్వకంగానే తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు. ముడుపుల డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేశామన్న ఆరోపణలను పూర్తిగా ఖండించారు. తాము చట్టాన్ని గౌరవిస్తామని, న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

జనసేన లో శత్రువులు ఉన్నారు..బాంబ్ పేల్చిన పవన్ కళ్యాణ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha