Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏఈ నూకరాజు కేసు.. సర్పవరం పోలీసుల కస్టడీలోకి సాదిక్ ఖాన్

ఏఈ నూకరాజు కేసు.. సర్పవరం పోలీసుల కస్టడీలోకి సాదిక్ ఖాన్

వార్త 3 weeks ago

AE Nookaraju Family Suicide Case: కాకినాడలో తీవ్ర కలకలం రేపిన అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్‌ను సర్పవరం పోలీసులు కోర్టు అనుమతితో అధికారికంగా తమ కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను తీవ్ర భద్రత నడుమ సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించారు.

Read Also : Mahabubabad crime: భర్త ఫోన్ ఎత్తలేదని ఇంత కఠిన నిర్ణయమా? తల్లి

 AE Nookaraju case: Sadiq Khan taken into Sarpavaram police custody.

AE Nookaraju Family Suicide Case: కోర్టు అనుమతితో 3 రోజుల కస్టడీ

ఈ కేసులోని మరిన్ని రహస్యాలు, కీలక ఆధారాలు రాబట్టేందుకు సాదిక్ ఖాన్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సర్పవరం పోలీసులు ఇటీవల కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల విజ్ఞప్తిని, కేసు తీవ్రతను పరిశీలించిన న్యాయస్థానం.. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాదిక్ ఖాన్‌ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కీలక విషయాలపై పోలీసుల ప్రశ్నల వర్షం

ఈ మూడు రోజుల కస్టడీ సమయంలో పోలీసులు సాదిక్ ఖాన్‌ను వివిధ అంశాలపై లోతుగా విచారించనున్నారు. ముఖ్యంగా ఏఈ నూకరాజు కుటుంబాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనల వెనుక ఉన్న అసలు కారణాలు, ఆర్థిక లావాదేవీలు మరియు ఈ వ్యవహారంలో ఇతర వ్యక్తుల ప్రమేయం ఏదైనా ఉందా అనే కోణాల్లో ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో పలు కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు, తాజా కస్టడీ విచారణ ద్వారా మరిన్ని సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. 3 రోజుల విచారణ ముగిసిన అనంతరం పోలీసులు సేకరించిన వివరాలను కోర్టుకు సమర్పించనున్నారు.

పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ రమా నందన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha