Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈసారి సరికొత్త రంగులో 'ఇందిరమ్మ చీరలు' పంపిణీ

ఈసారి సరికొత్త రంగులో 'ఇందిరమ్మ చీరలు' పంపిణీ

వార్త 2 months ago

Telangana: తెలంగాణలోని మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. గతేడాది ప్రారంభించిన 'ఇందిరమ్మ చీరల' పంపిణీ పథకాన్ని ఈ ఏడాది కూడా ఘనంగా కొనసాగించాలని నిర్ణయించింది.

ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు కోటి మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది.

Read Also:Telangana High Court: మద్యం తాగితే వాహనం సీజ్ చేయకూడదు.. పోలీసులకు కీలక ఆదేశాలు!

కొత్త రంగు.. సరికొత్త డిజైన్

గతేడాది ప్రభుత్వం నీలం రంగు చీరలను పంపిణీ చేయగా, ఈ ఏడాది మహిళల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేసింది.ఈ ఏడాది మహిళల కోసం ఆకర్షణీయమైన చిలకపచ్చ (Parrot Green) రంగును ప్రభుత్వం ఖరారు చేసింది.కోటి చీరల తయారీ కోసం సెర్ప్‌ (SERP) ఇప్పటికే టెస్కోకి (TESCO) రూ. 450 కోట్లు కేటాయించి ఆర్డర్ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రంలోని నేత కార్మికులకు కూడా ఉపాధి లభించనుంది.

 Indiramma Sarees distribution 2026

Telangana: పంపిణీ ఎప్పుడు?

ఈ చీరలను అక్టోబరు నాటికి సిద్ధం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబరు 19న రాష్ట్రవ్యాప్తంగా ఈ చీరల పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.సిరిసిల్ల, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాలలో నేత కార్మికులకు ఈ చీరల తయారీ బాధ్యతను అప్పగించనున్నారు. మొత్తం 11 ప్రాంతాల్లో ఈ పనులు అప్పగించాలని నిర్ణయించారు. గతేడాది పట్టణ, గ్రామీణ ప్రాంతాల మహిళలకు విడివిడిగా చీరల్ని పంపిణీ చేయగా.. ఈ ఏడాది గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

హుస్నాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ రైతులకు అండగా ఉంటాం.. కలెక్టర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha