Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏఎస్‌బిఎల్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

ఏఎస్‌బిఎల్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

వార్త 3 months ago

హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఏఎస్‌బిఎల్ (ASBL), భక్తి మరియు సాంస్కృతిక వైభవంతో శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించింది.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద జరిగిన ఈ వేడుకలో శ్రీ సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా, కన్నుల పండువగా సాగింది. ఏఎస్‌బిఎల్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ అజితేష్ కొరుపోలు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తిభావంతో పాటు సంగీత, నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నివాసితుల మధ్య ఐక్యతను, కమ్యూనిటీ భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఆధ్యాత్మిక సాయంత్రాన్ని నిర్వహించారు.

Read Also : Telangana: అక్రమ మైనింగ్‌పై రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఈ వేడుకలో ఆధ్యాత్మికతతో పాటు సామాజిక భాగస్వామ్యం ప్రతిబింబించేలా కోటికి పైగా రామ నామాలను రాసే అద్భుతమైన రికార్డు ప్రయత్నం జరిగింది. ఇది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలవగా, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నృత్య ప్రియ బృందం చేసిన కూచిపూడి ప్రదర్శన వేడుకకు శాస్త్రీయ సౌందర్యాన్ని జోడించగా, రామచారి శిష్యుల సంగీత కచేరీ ఆహుతులను ముగ్ధులను చేసింది. ముఖ్యంగా ప్రముఖ గాయని సునీత తన హృద్యమైన గీతాలాపనతో సాయంత్రాన్ని మరింత మధురంగా మార్చారు. భజనలు, రామాయణ నాటికలు వేడుకలోని ఉత్సాహాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాయి.

సినీ, బుల్లితెర ప్రముఖుల తాకిడి

ఈ మహోత్సవానికి సినీ, బుల్లితెర ప్రముఖుల తాకిడి విశేషంగా కనిపించింది. సుమ కనకాల, ఐశ్వర్య రాజేష్, లాస్య మంజునాథ్, శివ జ్యోతి, హిమజ, విష్ణుప్రియ, అలేఖ్య హారిక వంటి సెలబ్రిటీలు హాజరై వేడుకకు మరింత గ్లామర్‌ను అద్దారు. ఈ సందర్భంగా అజితేష్ కొరుపోలు మాట్లాడుతూ, సంప్రదాయ వేడుకలను సమిష్టిగా జరుపుకోవడం వల్ల ప్రజల మధ్య అనుబంధం బలపడుతుందని, భవిష్యత్తులో తమ ప్రాంగణాల్లో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆధ్యాత్మికత, సంస్కృతి మేళవించిన ఈ వేడుక నగరవాసులకు ఒక చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తల్లి బతికే ఉందని నమ్మించి ఏడేళ్లుగా పెన్షన్ తీసుకున్న ప్రబుద్దుడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha