Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈశ్వర్ సాయిపై మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు

ఈశ్వర్ సాయిపై మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు

వార్త 2 weeks ago

Madhuri Rathod: తెలుగు జానపద కళారంగంలో 'బాసింగ బలాలు' వంటి వరుస హిట్ పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ఫోక్ డ్యాన్సర్, నటుడు ఈశ్వర్ సాయి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.

తోటి ఫోక్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు సమాచారం. ఆయన కోసం రెండు ప్రత్యేక పోలీస్ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

Read Also : Mamitha Baiju: వరుసగా మూడు.. రూ. 200 కోట్లతో మమిత బైజు సరికొత్త రికార్డు!

 Madhuri Rathod lodges police complaint against Eshwar Sai.

Madhuri Rathod: వేములవాడలో భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దృశ్యాలు

ఈశ్వర్ సాయికి ఇప్పటికే వివాహమై ఒక బాబు కూడా ఉన్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఒక భవనంలో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కలిసి ఒకే గదిలో ఉన్న సమయంలో, ఆయన భార్య శరణ్య వారిని ప్రత్యక్షంగా పట్టుకున్నారు. అక్కడే వారి మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరగడం, దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు, పలువురు ఆర్టిస్టులు రకరకాల కామెంట్లు, ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు.. పరారీలో ఈశ్వర్ సాయి

సోషల్ మీడియా రచ్చ కొనసాగుతుండగానే ఈ ఘటనలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఇటీవల ఈ వివాదం మరింత ముదిరి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, నమ్మించి మోసం చేశాడని మాధురి రాథోడ్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈశ్వర్ సాయి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

రష్మిక మందన్న 'మైసా' మూవీ రిలీజ్ డేట్ ఖరారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha