Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రష్మిక మందన్న 'మైసా' మూవీ రిలీజ్ డేట్ ఖరారు

రష్మిక మందన్న 'మైసా' మూవీ రిలీజ్ డేట్ ఖరారు

వార్త 3 weeks ago

Mysa Movie: నటి రష్మిక మందన్న అభిమానులకు చిత్రబృందం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ 'మైసా' విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.

ఈ ఏడాది నవంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మంగళవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

'అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌' పతాకంపై నిర్మాత అజయ్‌ సాయిపురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రష్మికను ఇప్పటివరకు చూడని సరికొత్త పాత్ర, కోణంలో చూడబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

Read Also : Sannidhanam Post Office Movie: 'సన్నిధానం పోస్ట్ ఆఫీస్' మూవీ రివ్యూ!

 Release date confirmed for Rashmika Mandanna’s movie ‘The Girlfriend’ (Maisa)

Mysa Movie: అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్.. కేరళలో భారీ షెడ్యూల్

'మైసా' చిత్రం కోసం సాంకేతికంగా, మేకింగ్ పరంగా చిత్రబృందం ఎక్కడా తగ్గడం లేదు. ఇటీవల రష్మిక పాల్గొన్న కీలకమైన అండర్‌వాటర్ యాక్షన్ సన్నివేశాన్ని పూర్తి చేశారు. ఈ సన్నివేశం సినిమాలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని నిర్మాత అజయ్ సాయిపురెడ్డి వెల్లడించారు. కేరళలో నిర్వహించిన సుదీర్ఘ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. ప్రసిద్ధ స్టంట్ మాస్టర్ కెచా ఖంపక్డీ నేతృత్వంలో ఈ యాక్షన్ సీక్వెన్సులను కొరియోగ్రఫీ చేశారు.

గిరిజన గోండ్‌ యువతి పాత్ర కోసం బ్యాంకాక్‌లో శిక్షణ

ఈ సినిమాలో రష్మిక గిరిజన గోండ్‌ తెగకు చెందిన యువతిగా కనిపించనున్నారు. తీవ్రమైన భావోద్వేగాలతో పాటు శారీరకంగా కఠినమైన యాక్షన్ సన్నివేశాలు చేయాల్సి రావడంతో ఆమె దీనికోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో నిర్వహించిన స్టంట్ అండ్ కంబాట్ బూట్‌క్యాంప్‌లో పాల్గొని రోజుకు 8 గంటలకు పైగా శిక్షణ పొందినట్లు చిత్రబృందం తెలిపింది.

ఈ సినిమాలో ఈశ్వరీరావు, గురు సోమసుందరం, రావు రమేశ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తుండగా.. శ్రేయాస్ పి. కృష్ణ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్‌ పర్యవేక్షిస్తున్నారు.

వరుసగా మూడు.. రూ. 200 కోట్లతో మమిత బైజు సరికొత్త రికార్డు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha