Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎగువ నుంచి వస్తోన్న వరదతో నిండు కుండల్లా ప్రాజెక్టులు

ఎగువ నుంచి వస్తోన్న వరదతో నిండు కుండల్లా ప్రాజెక్టులు

వార్త 3 weeks ago

Godavari, Krishna Rivers : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల జీవనాడులైన కృష్ణా, గోదావరి నదులు మహోగ్రరూపం దాల్చాయి. భారీగా వస్తున్న వరద నీటితో ప్రధాన జలాశయాలు నిండు కుండల్లా మారాయి.

గోదావరి తీరంలో ప్రవాహం ప్రమాదకర స్థాయి దాటడంతో యంత్రాంగం అత్యధిక ప్రాధాన్యతతో సహాయక చర్యలు చేపట్టింది.

Read Also: Ram Mohan Naidu: విపక్షాల హేళనలకు అభివృద్ధితోనే సమాధానం ఇచ్చాం.. కేంద్రమంత్రి

 Godavari, Krishna Rivers

Godavari, Krishna Rivers : గోదావరి ఉగ్రరూపం - శ్రీరాంసాగర్ నుంచి భద్రాచలం వరకు

ఉత్తర తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఎగువ రాష్టాల నుంచి వస్తున్న భారీ ప్రవాహాలతో గోదావరి పరివాహక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ప్రాణహిత నుంచి వస్తున్న ప్రవాహంతో మేడిగడ్డ వద్ద 10.62 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ క్షేత్రస్థాయిలో పర్యటించి లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 60,000 క్యూసెక్కుల వరద వస్తోంది. 80.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 23 టీఎంసీలు ఉండగా, ఇదే ఉధృతి కొనసాగితే పది రోజుల్లో ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశముంది. ఎల్లంపల్లికి 88,705 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, దిగువకు 96,000 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద పోటు తీవ్ర రూపం దాల్చింది. శనివారం నాటికి నీటిమట్టం అమాంతం పెరిగి 55 అడుగులు (ప్రస్తుతం 55.1 అడుగుల వద్ద ప్రవాహం) దాటడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక (3rd Danger Warning) జారీ చేశారు.

మోదీని ఆలా తిడుతుంటే కన్నీళ్లొచ్చాయి - పవన్ ఎమోషనల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha