Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు చరిత్రలో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ (L&T) సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం మొత్తం వాటాను కొనుగోలు చేసి, ప్రాజెక్టును పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకుంది.
Read Also:Saraswathi Anthya Pushkaralu: మే 21 నుండి సరస్వతీ అంత్య పుష్కరాలు
Hyderabad Metro: పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి మెట్రో
ఎల్ అండ్ టీ సంస్థకు మెట్రో ప్రాజెక్టులో ఉన్న రూ.1,461.47 కోట్ల విలువైన 100 శాతం షేర్లను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది.ఈ షేర్ల బదిలీ ప్రక్రియ బుధవారం (ఏప్రిల్ 29, 2026) అధికారికంగా పూర్తయ్యింది. ఈ మేరకు సచివాలయంలో జరిగిన సమావేశంలో ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో ఉన్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ సంస్థగా మారింది. మెట్రో ఆస్తులు, నిర్వహణ బాధ్యతలు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి.
Hyderabad Metro Project Takeover
వాస్తవానికి మార్చి 31 నాటికే ఈ ప్రక్రియ పూర్తి కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి రుణం మంజూరు కావడంలో ఆలస్యం కావడంతో, గడువును ఏప్రిల్ 30కి పొడిగించారు. నిధులు అందడంతో ప్రభుత్వం ఈ స్వాధీన ప్రక్రియను పూర్తి చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
సూపర్వైజర్ల అసభ్య ప్రవర్తన.. తక్షణమే తొలగించాలని సీపీఎం డిమాండ్!

