Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎల్‌నినో ఎంట్రీ రానున్న రోజుల్లో రికార్డు స్థాయికి చేరనున్న ఉష్ణోగ్రతలు

ఎల్‌నినో ఎంట్రీ రానున్న రోజుల్లో రికార్డు స్థాయికి చేరనున్న ఉష్ణోగ్రతలు

వార్త 1 day ago

El Nino : భారతదేశ వాతావరణాన్ని, ముఖ్యంగా వర్షపాతాన్ని శాసించే 'ఎల్‌నినో' ముప్పు మళ్లీ పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు మళ్లీ చురుగ్గా మారాయని, ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న నైరుతి రుతుపవనాల కాలంలో దీని ప్రభావం మరింత తీవ్రమయ్యే సూచనలు ఉన్నాయని ఐఎండీ స్పష్టం చేసింది.

ఈ పరిణామం దేశవ్యాప్త వర్షపాతం, సాగునీటి లభ్యత మరియు వ్యవసాయ రంగాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Read also:Lucknow-Delhi Indigo Flight: లక్నో - ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

పసిఫిక్ సముద్రంలో పెరుగుతున్న వేడి

భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ప్రమాదకర స్థాయికి పెరిగాయని వాతావరణ శాఖ తన తాజా నివేదికలో వెల్లడించింది. దీనివల్ల ఎల్‌నినో అధికారికంగా ప్రారంభమైందని, రాబోయే నెలల్లో ఇది మరింత బలపడనుందని అంచనా వేసింది. పసిఫిక్ సముద్రంలోని మధ్య, తూర్పు భాగాలు అసాధారణంగా వేడెక్కడాన్నే ఎల్‌నినో అంటారు. గత చరిత్రను పరిశీలిస్తే, ఎల్‌నినో వచ్చిన ప్రతిసారీ దేశంలో వర్షాలు తగ్గి కరవు పరిస్థితులు ఏర్పడటం, పంటల దిగుబడి పడిపోవడం వంటి నష్టాలు జరిగాయి.

El Nino : కేంద్రం ముందస్తు వ్యూహం: 197 జిల్లాలు అలర్ట్

ఎల్‌నినో ముప్పు ముంచుకొస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం తక్షణ రక్షణ చర్యలు ప్రారంభించింది. ఈ విషయమై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం పడటానికి ఎక్కువ అవకాశం ఉన్న అత్యంత సున్నితమైన 197 జిల్లాలను ఇప్పటికే గుర్తించామని తెలిపారు. ఆయా జిల్లాల కోసం రాష్ట్రాల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు (Contingency Plans) సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రత్యామ్నాయ విత్తనాలు, అవసరమైన ఎరువులను ముందే అందుబాటులో ఉంచామని వివరించారు.

‘ఖేత్ బచావో అభియాన్’ ప్రారంభం

రైతులను తక్కువ వర్షపాత పరిస్థితులకు సన్నద్ధం చేసేందుకు దేశవ్యాప్తంగా 'ఖేత్ బచావో అభియాన్' అనే అవగాహన కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ మొత్తంలో సాధారణ సగటు కంటే కేవలం 90 శాతం వరకే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఒకవేళ రాబోయే రోజుల్లో ఎల్‌నినో మరింత బలపడితే, రుతుపవనాల ద్వితీయార్థంలో (సీజన్ చివరి నెలల్లో) రైతాంగానికి సాగు సవాళ్లు మరింత పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

read also:

వరవరరావు పిటిషన్‌పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు.. ఎన్ఐఏకు నోటీసులు జారీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha