Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎల్‌నినో పరిస్థితులపై సమీక్ష.. వ్యవసాయ శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

ఎల్‌నినో పరిస్థితులపై సమీక్ష.. వ్యవసాయ శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

వార్త 2 weeks ago

El Nino Impact AP Farming: అంతర్జాతీయ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్న 'ఎల్‌నినో' (El Nino) పరిస్థితుల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ సాగు విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

బుధవారం సచివాలయంలో వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వాతావరణ మార్పులను తట్టుకునేలా రైతులు పంటల మార్పిడి (Crop Rotation) విధానాలను అవలంబించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 El Nino Impact AP Farming

Read also: Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో మధ్యంతర ఊరట

ప్రకృతి సేద్యం, గ్లోబల్ సర్టిఫికేషన్‌పై ఫోకస్

రాష్ట్రంలో రైతులు సాంప్రదాయ పద్ధతుల నుంచి పెద్ద ఎత్తున ప్రకృతి సేద్యం (Natural Farming) వైపు మళ్లేలా చైతన్యపరచాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్‌కు భారీ డిమాండ్ ఉందని, దీనిపై రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. రైతులను చైతన్యపరిచే ఈ అవగాహన కార్యక్రమాల్లో తానే స్వయంగా పాల్గొంటానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శాస్త్రీయ పద్ధతుల్లో సాగును ప్రోత్సహిస్తూ.. మిర్చి, పొగాకు, తోతాపురి మామిడి వంటి వాణిజ్య పంటల దిగుబడులు, మార్కెటింగ్‌పై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పప్పు దినుసుల సాగు.. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర

మార్కెట్‌లో ప్రస్తుతం వేటికైతే ఎక్కువ డిమాండ్ ఉందో, అటువంటి పప్పు దినుసుల సాగును పెంచేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం నిర్దేశించారు. తద్వారా రైతులకు గరిష్ట లాభాలు చేకూరుతాయన్నారు. అలాగే, పొగాకు కొనుగోలుదారులతో తక్షణమే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్కెట్‌లో సరైన గిట్టుబాటు ధర లభించే వరకు రైతులు తమ పంటను సురక్షితంగా నిల్వ చేసుకునేందుకు ఉన్న సౌకర్యాలను పరిశీలించాలన్నారు. ప్రస్తుత సాగు పరిస్థితులను, మార్కెట్ అవసరాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ తదుపరి అడుగులు వేయాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

యోగాంధ్ర-2026 ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha