Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో మధ్యంతర ఊరట

పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో మధ్యంతర ఊరట

వార్త 2 weeks ago

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన పోస్టులు, వీడియోలపై బెంగళూరు న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.

పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ఉన్న ఆయా కథనాలను తక్షణమే తొలగించాలని లేదా వాటి ప్రసారాన్ని నిలిపివేయాలని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలైన ఎక్స్ (గTwitter), గూగుల్, మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్) సంస్థలను కోర్టు ఆదేశించింది.

 Kodi Cheruvu Land Issue

read also:Chandrababu Naidu: సాయి కృష్ణ మిస్సింగ్ కేసుపై సీఎం చంద్రబాబు డీజీపీకి ఆదేశాలు

‘జాన్ డో’ ఉత్తర్వులు జారీ చేసిన న్యాయస్థానం

తెలంగాణలోని కోడి చెరువు భూ వివాదానికి ముడిపెడుతూ తనపై సాగుతున్న దుష్ప్రచారాన్ని సవాల్ చేస్తూ పవన్ కల్యాణ్ పరువు నష్టం దావా వేశారు. బుధవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషన్‌లో స్పష్టంగా పేర్కొన్న యూఆర్‌ఎల్‌లతో (URLs) పాటు, గుర్తుతెలియని లేదా అజ్ఞాత ఖాతాల (Anonymous Accounts) నుంచి వచ్చే ఇటువంటి పోస్టులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేస్తూ కోర్టు కీలకమైన “జాన్ డో” (John Doe) ఆదేశాలను జారీ చేసింది.

Pawan Kalyan: అసలేమిటీ వివాదం?

తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా పరిధిలోని కోడి చెరువు భూములను పవన్ కల్యాణ్ కబ్జా చేశారని, ఇందుకోసం భూ రికార్డులను సైతం ఫోర్జరీ చేశారంటూ మే నెలాఖరు నుంచి జూన్ మొదటి వారం వరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం సాగింది. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సాగుతున్న ఈ కుట్రపూరిత ప్రచారంపై పవన్ కల్యాణ్ న్యాయపోరాటానికి దిగారు. ఈ కేసులో తదుపరి విచారణను బెంగళూరు కోర్టు జులై 24వ తేదీకి వాయిదా వేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

పవన్ తెలంగాణ పర్యటన పై పేర్ని నాని సెటైర్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha