LPG Gas : ప్రస్తుతం దేశంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడుతున్నారు. ఈ పెట్రోల్ వాడకంపై విమర్శులు వస్తున్నా.. కేంద్రం మరో ముందడుగు వేసేందుకు సిద్ధమైంది.
ఎల్పీజీకి బదులుగా ఇథనాల్ వంట ఇంధనంగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఇథనాల్ ఏటీఎంలు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ప్రజలు డబ్బాల్లో ఇథనాల్ కొనుగోలు చేసి ఎల్పీజీకి బదులుగా దీన్ని వాడొచ్చని చెబుతున్నారు. అయితే ఇథనాల్ వాడేందుకు ప్రత్యేక డిజైన్ చేసిన స్టౌలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.
Read Also: Central Government Debt : కేంద్ర ప్రభుత్వ అప్పు రూ. 201 లక్షల కోట్లు
LPG Gas
LPG Gas : నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి దేశాలతో చర్చలు
ప్రస్తుతం దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది. ఇథనాల్ ఉత్పత్తి 2 వేల కోట్ల లీటర్లు దాటింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 2,400 కోట్ల లీటర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో దేశీయ అవసరాలకు 1,400 – 1,500 కోట్ల లీటర్లు ఉపయోగిస్తున్నారు. మిగిలిన దాదాపు 700 కోట్ల లీటర్ల అదనపు ఇథనాల్ ఉపయోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. దేశీయంగా మిగులుతున్న ఇథనాల్‌ను సొంత ఉత్పత్తి లేని నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి దేశాలకు ఎగుమతి చేసేందుకు చర్చలు జరుపుతోంది. అంతేకాకుండా విమానయాన రంగంలో సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ తయారీకి ఇథనాల్‌ను ముడిసరుకుగా వాడేందుకు ప్లాన్ చేస్తున్నారు.

